ఎప్పుడూ కనిపించని విధంగా కొత్తగా ఉంటాడు !

‘రంగస్థలం… 1985’ పేరుతో రామ్‌చరణ్ హీరోగా సినిమా మొదలైనప్పటి నుండి ఈ చిత్ర విశేషాల గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల భారీ అంచనాల మేరకు దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈమధ్య సుకుమార్ మాట్లాడుతూ హీరో రామ్‌చరణ్ గురించి  కామెంట్ చేశాడు… “రంగస్థలం చిత్రంలో రామ్‌చరణ్ చాలా బాగుంటాడు. ఎప్పుడూ కనిపించని విధంగా కొత్తగా ఉంటాడు ఈ చిత్రంలో. ప్రేక్షకులు ఇంతవరకు చూసిన చరణ్‌కు ఈ చిత్రంలో చూడబోయే చరణ్‌కు చాలా తేడా ఉంటుంది.నేను ప్రమాణం చేస్తున్నా రామ్‌చరణ్ నటన అదిరిపోయేలా ఉంటుంది”అని చెప్పారు.

ఈ ఒక్క మాటతో మెగా అభిమానులు అందరూ ఎంతో సంతోషపడిపోతున్నారు. కెరీర్‌లో ఎక్కువగా మాస్ సినిమాలు చేసిన చరణ్ అకస్మాత్తుగా ‘ధృవ’ సినిమాతో కొంత రూటు మార్చాడు. ఇప్పుడు సుకుమార్ సినిమాతో ఇంకాస్త పద్ధతి మారుస్తుండడంతో… ఆ రొటీన్ కమర్షియల్ సినిమాల ముద్ర నుండి దూరమయ్యే అవకాశముంది. మారుమూల పల్లెటూరులో గోదావరి పచ్చని పొలాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న ‘రంగస్థలం… 1985’ .. ‘పేరులో ఉన్న కాలం నాటి కథే!’ అని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్, సమంతలు ఒక పల్లెటూరు జంటగా చేస్తున్నారు .