నిధికి అతను ‘జస్ట్ ఫ్రెండ్’ మాత్రమేనట !

నిధి అగ‌ర్వాల్… టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్, ‘సవ్యసాచి’ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సహజీవనం చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది.ప‌టౌడీ, ష‌ర్మిలా ఠాగూర్ నుంచి ఇప్ప‌టి విరాట్ కోహ్లీ, అనుష్క‌శ‌ర్మ దాకా ఎంద‌రో క్రికెట‌ర్లు హీరోయిన్ల‌ను వివాహమాడారు. క్రికెటర్లతో బాలీవుడ్ కధానాయికల ప్రేమాయణం ఎప్పటి నుంచో నడుస్తున్న వ్యవహారమే. ఇలా నటీమణులు, క్రికెటర్లు వివాహబంధంతో ఒకటైన జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సహజీవనం చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. వారిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్ లో వైర‌ల్ గా మారాయి. కొన్ని నెలల క్రితం వీరిద్ద‌రూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో జంట‌గా కనిపించారు. ఆ ఫోటోలే సామాజిక మాధ్యమాల్లో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి.
 
ఈ జంట తరచూ పార్టీలకు, పబ్బులకు కలిసి వెళ్తూ కెమెరాకు చిక్కడంతో ఈ రూమర్లు మరింత పెరిగాయి. అయితే ఈ పుకార్ల‌పై వీరిద్ద‌రూ అప్పడు పెదవి విప్ప‌లేదు. కానీ, తాజాగా ‘సవ్యసాచి’ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ లో నిధి అగర్వాల్ ఆ గాసిప్స్ పై స్పందించింది… రాహుల్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పింది. తామిద్దరం ఒకే ప్రాంతానికి చెందిన వారమని, అలాగే చాలాకాలంగా మంచి మిత్రులమని చెప్పింది. దీంతో అప్పుడప్పుడు కలుస్తుంటామని, ఈ క్రమంలోనే తమపై రూమర్లు పుట్టుకొచ్చాయని చెప్పుకొచ్చింది. రాహుల్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని నిధి తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిధికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. నిధి అఖిల్ సరసన ‘మిస్టర్ మజ్ను’ లో చేస్తోంది.