కండలు తిరిగిన బాడీ కోసం స్పెషల్‌ జిమ్ ట్రైనింగ్

పాత్రలకు అనుగుణంగా బాడీని మలుచుకునే  హీరోల జాబితాలో యంగ్ హీరో నిఖిల్ కూడా చేరిపోయాడు. త్వరలో చేయబోయే కన్నడ సినిమా ‘కిర్రాక్ పార్టీ’ తెలుగు రీమేక్‌లో తన క్యారెక్టర్ కోసం అతను పది కిలోల బరువు పెరిగాడట. ఇందుకోసం యుకె వెళ్లి ఇరవై రోజులు ఉండి… స్పెషల్‌గా జిమ్ ట్రైనింగ్ తీసుకున్నాడని తెలిసింది. దీంతో మంచి కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు నిఖిల్. ఇంకా కొన్ని కిలోల బరువు పెరిగాక… బాడీ బిల్డర్ గెటప్‌లో ఫొటో షూట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాడట. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ యువ కథానాయకుడు ‘కిర్రాక్ పార్టీ’ రీమేక్‌తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. త్వరలో తమిళ సినిమా ‘గణితన్’ రీమేక్‌లో కూడా నిఖిల్ నటించబోతున్నాడని తెలిసింది. ఈ రెండింటి తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో చందు మొండేటి డైరెక్షన్‌లో అతను సినిమా చేస్తాడు.