నిలేష్ హీరోగా జ‌యంత్ సి.ప‌రాన్జీ `న‌రేంద్ర‌`

`ప్రేమించుకుందాం..రా`, `బావగారూ బాగున్నారా`, `ప్రేమంటే ఇదేరా`, `టక్కరి దొంగ`, `ఈశ్వర్‌`, `లక్ష్మీ నరసింహా`, `శంకర్‌దాదా ఎంబిబిఎస్‌` వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ఇషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `న‌రేంద్ర‌`. ఈ చిత్రంలో న‌రేంద్ర అనే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ ద్వారా నిలేష్ అనే హీరోను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు డైరెక్ట‌ర్ జ‌యంత్‌. అలాగే ల్యాక్‌మీ ఫేమ్ ఇజ‌బెల్లా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. జ‌న‌వ‌రి నెల‌లో హైద‌రాబాద్‌, గుజ‌రాత్‌ల‌లో నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పాకిస్థాన్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.  బాలీవుడ్‌లో `రాయిస్` చిత్రానికి సంగీతం అందించిన రామ్ సంప‌త్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాజ్ కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే సీనియ‌ర్ టెక్నిషియ‌న్ వెంక‌టేశ్వ‌ర‌రావు ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండ‌గా,   వెంక‌ట్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్రంలో న‌టించే ఇత‌ర న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తారు.
ఈ చిత్రానికి ఫైట్స్: వెంక‌ట్‌,  నిర్మాణం: ఇషాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌యంత్ సి.ప‌రాన్జీ.
Nilesh Is Hero For Jayanth C Paranji’s New Film ‘Narendra’
Decent Director Jayanth C Paranji who delivered Hits like ‘Preminchukundam Raa’,’Bavagaru Bagunnara’,’Premante Idera’,’Takkari Donga’,’Eeshwar’,’Lakshmi Narasimha’,’Shankar Dada MBBS’ is now coming with an emotional action thriller ‘Narendra’ in Eshaan Entertainments Production. Director Jayanth is introducing Nilesh as Hero to Tollywood with a powerful character, ‘Narendra’. Lakme Fame Izabelle is being introduced as a Heroine with this film. A non-stop shooting schedule is planned at Hyderabad, Gujarat in January. This emotional action thriller is set in the backdrop of Pakistan. ‘Raees’ fame Ram Sampath is composing the Music for this film. Cinematography by Raj Nalli. Editing by Senior Technician Venkateswara Rao. Fights by Venkat. Other Actors and Technicians will be announced soon.
Produced by Eshaan Entertainments
Written and Directed by Jayanth C Paranji