“దెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ విశాలాక్షి సినిమాకి కూడా డబ్బులు వస్తాయి”… అన్నారు సి కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేసి మట్లాడుతూ… “ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్ లో పని చేసారు. రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయ సాధిస్తుంది. ఈ చిత్ర నిర్మాతలు అందరూ పెద్ద సక్సెస్ సాధిస్తారు. దర్శకుడైన మహేష్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. దర్శకుడు శ్రీహరి రాజుగారికి మహేష్ చంద్ర ఎంతో అండగా నిలిచారు”.. అని అన్నారు..
దర్శకుడు నిమ్స్ శ్రీహరి రాజు గారు మాట్లాడుతూ.. “దేవుడి దయ వలన స్నేహితుల సహకారంతో విశాలాక్షి సినిమా తీసాను. ట్రైలర్ చూసిన వారంతా చాలాబాగుంది అని అభినందిస్తున్నారు. ఈ సినిమా రూపకల్పనలో మహేష్ చంద్ర గారి సహకారం మరువలేనిది. ఈ చిత్ర నిర్మాతలు నా మిత్రులే. ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు” అని అన్నారు.
మహేష్ చంద్ర మాట్లాడుతూ.. శ్రీహరి రాజు గారికి అనుభవం లేకపోయినా.. సినిమా మీద పూర్తి అవగాహన ఉంది. అమెరికాలో ఉన్నప్ప్పుడు నాకు కథ చెప్పి పది నిమిషాల నిడివితో ఫోన్ లో షూట్ చేసి ఎడిట్ చేసి, నాకు చూపించారు. అది చాలా బాగుంది. ఆ తర్వాత ఈ సినిమా తీశారు. ఆయనకు నా వంతు సహకారం అందించాను. ఈ సినిమాలో నేను సాఫ్ట్ వెర్ ఇంజినీర్ గా నటించాను అని చెప్పారు.
ఈ ఫంక్షన్ కి హీరో సూర్య తేజ,దర్శకుడు వీర శంకర్, బాబ్జి హాజరై శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ చిత్రానికి కెమెరా : కుర్రా చింతయ్య(చిన్న), సంగీతం : సంతోష్ కవల, ఎడిటర్ : శివ నిర్వాణి, కొరియోగ్రఫీ : సతీష్ రాజ్, పాటలు : ఇమ్రాన్ శాస్త్రి, నిమ్స్ శ్రీహరి రాజు.నిర్మాణ సహకారం: సి. హెచ్. శ్రీనివాస్, నిర్మాతలు: ఎన్. వి. సుబ్బరాజు, డి. విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి. శ్రీహరిరాజు, డి. ఎస్. హెచ్. దీప్తి.కథ- మాటలు- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: నిమ్స్ శ్రీహరి రాజు.