రెండు పాటలు మిన‌హా `నిన్ను చూశాక‌` పూర్తి !

శాంతి రాజు, ఆధ్య జంట‌గా ఎస్. ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ పై ఈశ్వర్ నిర్మిస్తోన్న చిత్రం `నిన్ను చూశాక‌`. శాంతి రాజు, ఆధ్య జంట‌గా యు. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను నిర్మాత‌ ఈశ్వర్ వెల్ల‌డించారు….
 
“మా చిత్రంలో అంతా కొత్త వాళ్లే న‌టిస్తున్నారు. అయినా అనుభ‌వం గ‌ల వారిలా న‌టించారు. ద‌ర్శ‌కుడు మంచి ఔట్ పుట్ తీసుకొచ్చారు. ‘ఫ్యాక్షన్ క‌మ్ ల‌వ్ స్టోరీ’ ఇది. ఆద్యంతం ఆస‌క్తిరంగా ఉంటుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకుంటుంది. రెండు పాటలు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చివ‌రి షెడ్యూల్ …క‌ర్నూలు, బ‌ళ్లారి, హంపీ, గుంత‌క‌ల్లు, ఆదోనీ ప్రాంతాల్లో చిత్రీక‌రించాం. మ‌రికొన్ని కీల‌క స‌న్నివేశాలు ఔట్ డోర్ లో షూట్ చేసాం. క‌థ‌కు త‌గ్గ చ‌క్క‌ని పాట‌లు కుదిరాయి. మ్యూజిక్ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటుంది. పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏలేంద్ర‌, ఛాయాగ్ర‌హ‌ణం: రామ్ శ్రీనివాస్, స‌హ నిర్మాత‌: పి. ప‌వ‌న్