‘రాజరథం’లో నిరూప్, అవంతికల రొమాంటిక్ చలి పోరాటం

ఇటీవల విడుదలైన ‘రాజరథం’ లోని రెండు పాటలు ‘కాలేజ్ డేస్’, ‘నీలి మేఘమా’ ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాబట్టుకున్నాయి. దర్శకుడు అనూప్ సంగీతం తో, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం తో రూపొందిన ఈ పాటలు కనువిందైన దృశ్యాలతో వీక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. కలర్ ఫుల్ విజువల్స్ తో అందంగా తెరకెక్కిన ఈ పాటల చిత్రీకరణ వెనక ఆసక్తికర విశేషాలున్నాయి. ఎన్నో జ్ఞ్యాపకాలని గుర్తు చేసేలా, కలల్లో విహరింపచేసే లా ఉన్న పాటలు వాస్తవానికి అందులో నటించిన నిరూప్ అవంతిక ల ను వణికించాయి. 
 
ఆ పాటల చిత్రీకరణలో రెయిన్ సీక్వెన్స్ కోసం వాడిన నీరు చాలా చల్లగా ఉండడమే అందుకు కారణం. వణికించేంత చల్లని నీటిలో తడుస్తూ పాటకి తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ‘కట్’ చెప్పగానే చిత్ర బృందం నిరూప్, అవంతిక ల మీద వేడి నీళ్ళు పోసి, బ్లాంకెట్ కప్పాక కానీ మాములు స్థితి కి వచ్చేవారు కాదు.  ఇలాంటి పరిస్థితుల్లో కూడా పెర్ఫెక్షనిస్ట్ గా పేరున్న దర్శకుడు అనూప్ తానూ అనుకున్న ‘పర్ఫెక్ట్ షాట్’ అనుకున్నట్లు వచ్చే వరకు రీటేక్ ల కి పిలిచేవారు. షూటింగ్ అయిపోయాక నిరూప్, అవంతిక లు చలి దెబ్బకి హీటర్ల ముందు ఒక అరగంట కూర్చుంటే కానీ వణుకు తగ్గేది కాదు. తర్వాతి రోజున షూటింగ్ కి ఇబ్బంది రాకూడదని జ్వరం తోనే షూట్ చేశారు. సినిమా చిత్రీకరణ ఎంతో కష్టం, శ్రమ తో కూడుకున్నది. ఇంత శ్రమ పడి చేశారు కాబట్టే ‘రాజరథం’ ట్రైలర్, పాటలు అంత అద్భుతంగా రాగలిగాయి. ప్రేక్షకులని ఇంతలా ఆకట్టుకోగలిగాయి. తమ మొదటి ప్రయత్నంలో నే  ఉత్తమ నిర్మాణ విలువలతో మంచి సినిమా ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న ‘రాజా రథం’ టీం ని అభినందించాల్సిందే. అజయ్ రెడ్డి, అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్ శాస్త్రి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘రాజరథం’ ఫిబ్రవరి 16 నుండి ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది.
 
 
Nirup & Avantika’s freezing romance in Rajaratham
 
With College Days & Neeli Meghama songs composed by Anup Bhandari and written by Ramjogayya Sastry from “Rajaratham” making waves, here is an interesting behind the scene story for all of you. The songs that looks all nostalgic and romantic had the lead pair Nirup and Avantika shivering. Wondering why? While shooting for the rain sequence in Ooty, the water used was so cold that the lead pair were literally shivering and had to try hard to keep up with the required expression. Once it was said “CUT”, the crew used to run to spill hot water on them and cover them with a blanket to bring them back to normalcy. Despite this condition, Anup who is known for his perfection continued to call for retake till he got his “PERFECT SHOT”. At the end of the shoot, Nirup and Avantika were literally frozen and had to sit in front of portable heaters for 30 mins to get back to normal. Next day both were down with fever but ensured to not halt the shoot. Movie making is not a cake walk and the trailer, songs definitely lives upto the expectations thats on this debut Team. Kudos to the team for their commitment to give good cinema. 3 cheers to the team “Rajaratham” whose Worldwide Royal Journey begins Feb 16th and Jollyhits’ Producers Ajay Reddy, Anju Vallabhaneni, Vishu Dakappagari and Sathish Sastry are gearing up for the release.