నితిన్..చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ చిత్రం ‘చెక్’

నితిన్ కధానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘చెక్‘ అనే పేరు పెట్టారు.ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ చెక్ ‘ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు  కొరటాల శివ ఆవిష్కరించారు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ-”చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది .ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది” అని చెప్పారు.

నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. చంద్రశేఖర్ యేలేటిమేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియావారియర్ ల పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఈ నెల 12 నుంచినెలాఖరువరకూ షెడ్యూల్ చేస్తాం. దాంతో దాదాపుగా చిత్రీకరణ పూర్తవుతుంది” అని తెలిపారు.