ఆగస్ట్‌ 11న నితిన్‌, హను రాఘవపూడి ‘లై’

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను ఆగస్ట్‌ మొదటి వారంలో విడుదల చేస్తున్నారు.
నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ – ”ఇటీవల విడుదలైన ‘బాంభాట్‌’, ‘మిస్‌ సన్‌షైన్‌’ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే టీజర్‌కి కూడా మంచి అప్రిషియేషన్‌ వస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆగస్ట్‌ మొదటివారంలో ట్రైలర్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నాం. మా బేనర్‌లో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ తర్వాత హను రాఘవపూడి చేస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మరో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీ అవుతుంది” అన్నారు.
యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.