సినీ జీవితంలో నాకు తెలిసిన మరో ముఖ్యమైన అంశం అదే !

జయలలిత జీవితం ఆధారంగా మూడు నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో నిత్యా మీనన్‌ నటిస్తున్న ‘ఐరన్‌ లేడీ’ ఒకటి. జయలలిత జీవితంతో మూడు నాలుగు సినిమాలు రూపొందుతున్న నేపథ్యంలో ఒకే వ్యక్తి గురించి ఇన్ని సినిమాలు వస్తున్నా మీరు నటించడానికి కారణం ఏంటి? మీరు నటిస్తున్న ‘ఐరన్‌ లేడీ’ ప్రత్యేకత ఏంటి?..అని నిత్యా మీనన్‌ ని అడిగితే.. ‘‘నిజమే…జయలలితగారి జీవితంపై సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయని నాకు తెలుసు. అందుకే అందులో ఎందుకు చేయాలి? అనే అనుమానం నాకూ వచ్చింది.నా సందేహాన్ని ‘ఐరన్‌ లేడీ’ దర్శకురాలు ప్రియదర్శిని ముందుంచాను. దానికి ఆమె చెప్పిన సమాధానం నాకు చాలా సంతృప్తినిచ్చింది….
“జయలలితగారిపై ఎవరెన్ని సినిమాలు తీసినా తీయనివ్వండి. కానీ, మనం తీసే సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేదే పాయింట్‌. నేను జయలలితగారిని వ్యక్తిగతంగా చాలాసార్లు కలిశాను. ఆమెను దగ్గరినుంచి గమనించాను, చాలా విషయాలు మాట్లాడాను” అన్నారు ప్రియదర్శిని. ఆమె మాటల్లో చాలా కాన్ఫిడెన్స్‌ కనిపించింది. మనం మంచి సినిమా చేస్తున్నాం అనే నమ్మకం కలిగింది. అందుకే ధైర్యంగా ‘ఐరన్‌ లేడీ’లో నటిస్తున్నాను’’ అన్నారు.
 
నాకెరీర్‌లో అద్భుత పెర్ఫార్మెన్స్‌!
నిత్యా మీనన్ అన్ని భాషల్లోనూ ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. లాక్‌డౌన్ సమయంలో రెండు పాటలను రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా, సినిమా కథ కూడా రాసిందట.
“లాక్‌డౌన్ సమయంలో నేను రెండు పాటలను రికార్డ్ చేశాను. సినీ జీవితంలో నాకు తెలిసిన మరో ముఖ్యమైన అంశం సంగీతం. మంచి రొమాంటిక్ మెలోడీ, అలాగే లండన్‌కు చెందిన ఆర్టిస్ట్‌తో కలిసి ఓ క్లాసికల్ సాంగ్ రికార్డ్ చేశాను. అలాగే స్క్రిప్టు వర్క్ కూడా కొంత చేశాను. స్క్రిప్టు రాయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. కొన్ని నెలల్లో ఆ వర్క్ పూర్తవుతుంద`ని తెలిపింది. అలాగే `బ్రీత్` వెబ్‌సిరీస్ గురించి స్పందిస్తూ.. తన కెరీర్‌లోని అద్భుత పెర్ఫార్మెన్స్‌లలో ఇది ఒకట”ని చెప్పింది..
అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ నటించిన వెబ్ సిరీస్ `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్`.ఈ వెబ్ సిరీస్ లో నిత్య లెస్బియన్‌గా నటించింది. సినిమాల్లో సంప్రదాయ పాత్రల్లో నటించే నిత్య ఈ వెబ్ సిరీస్ లో లెస్బియన్‌గా నటించడంపై పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మరో నటితో నిత్య లిప్ లాక్ కూడా చేయడం చర్చనీయాంశమైంది. అన్ని భాషల్లో నిత్యా మీనన్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే `బ్రీత్‌: ఇన్‌ టు ద షాడోస్`లో లెస్బియన్‌గా నటించడంతో ..మరో నటితో లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దుస్తుల వేలంతో సహాయం !
కరోనా మహమ్మారి వల్ల పేదల జీవితాలు దయనీయంగా మారాయి. అలాంటి వారిని ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. నటి నిత్యామీనన్‌ “నేను సైతం” అంటూ సిద్ధమయ్యారు. తన దుస్తులను వేలం వేసి తద్వారా వచ్చిన డబ్బును కరోనా బాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు.దీని గురించి నిత్యామీనన్‌ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ఇటీవల ఒక ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నా. నేను ధరించిన దుస్తులను స్నేహితురాలు డిజైనర్‌ కరోని ప్రత్యేకంగా తయారు చేసిందని చెప్పింది. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి పేదల జీవితాలను చిధ్రంగా మార్చేసిందని..అలాంటి వారు మళ్లీ నిలదొక్కుకోవడానికి సాయం చేయాలని భావించినట్లు..అందుకే తాను ఫ్యాషన్‌ షోలో ధరించిన దుస్తులతో పాటు సినిమాలో ధరించిన ఖరీదైన దుస్తులను వేలం వేయాలనుకున్నానని పేర్కొంది. తద్వారా వచ్చిన డబ్బు మొత్తం “అర్పణం ట్రస్టు”కు చేరుతుందని చెప్పింది. ఆ ట్రస్ట్‌ పేద కుటుంబాలకు సాయం చేస్తుందని నిత్యామీనన్‌ చేప్పింది.