ఆమెలా చెయ్యడానికి నన్ను నేను తయారుచేసుకుంటున్నా!

“జయలలితగా నటించడానికి నేనే పర్ఫెక్ట్‌” అని చెబుతోంది నిత్యామీనన్‌. జయలలిత లానే నేనూ నచ్చని విషయాల గురించి ముఖం మీదే చెప్పేస్తానని అంది. ఇప్పుడు జయలలిత పాత్ర చేస్తుండడంతో.. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుంటున్నానని అంది. జయలలితలా నటించడానికి.. తనను తాను తయారు చేసుకుంటున్నానని చెప్పింది. జయలలిత పాత్రకోసం వంద శాతం శ్రమిస్తానని నిత్యామీనన్‌ అంటోంది. జయలలిత పాత్రలో నటించడం గురించి నటి నిత్యామీనన్‌ చాలాసార్లు తన అభిప్రాయాలను మీడియాతో పంచుకుంది. తాజాగా ‘తలైవి’ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైన తరువాత నిత్యామీనన్‌ మరో సారి ఇలా స్పందించింది… నిత్యా మీనన్‌ నటిస్తున్న జయలలిత చిత్రానికి ‘ది ఐరన్‌ లేడీ’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. దీనికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు. దీని చిత్రీకరణ ప్రారంభం కాకపోయినా, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. అయితే అందులో జయలలిత ఫొటోను మార్పింగ్‌ చేశారనే విమర్శలు వచ్చాయి.
 
తనకు అనిపించింది మాట్లాడడం..తను రైట్‌ అనుకుంది చేసేయ్యడం… అలా నిత్యామీనన్‌ పలు విమర్శలకు గురవుతుంది . అలా నిత్యామీనన్‌పై ‘పొగరుబోతు’ అనే ముద్ర పడింది. అయితే నటిగా మాత్రం మంచి పేరే సంపాదించుకుంది. నాయకి పాత్రలనే చేస్తానని గిరి గీసుకుని కూర్చోకుండా.. తనకు నచ్చితే, అది చిన్న పాత్ర అయినా చేసేస్తుంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రకు జీవం పోసేపనిలో ఉంది . జయలలిత బయోపిక్‌ రెండు చిత్రాలు, ఒక వెబ్‌ సిరీస్‌ తయారవుతున్నాయి.
 
‘ది క్వీన్‌’ పేరుతో దర్శకుడు గౌతమ్‌మీనన్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌లో నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇక సినిమాగా తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రానికి విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జయలలితగా బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్..చిన్న టీజర్‌ ఇటీవల విడుదల చేశారు. జయలలితగా కంగనారనౌత్‌ సరిగా కుదరలేదని విమర్శలు వచ్చాయి.