‘ది ఐరన్ లేడీ’ జయలలితగా నిత్య

జయలలిత… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళంలో ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. ప్రియదర్శిని ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటించనున్నారు. టైటిల్ పాత్ర కోసం ఇప్పటికే ఆమె పరిశోధన ప్రారంభించినట్లు సమాచారం. జయలలిత రాజకీయ ప్రయాణంతో పాటు సినిమా నటిగా నిలదొక్కుకునే క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, ఆటుపోట్లను ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నట్లు తెలిసింది. త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ జీవిత కథతో రూపొందుతున్న ఎన్టీఆర్ చిత్రంలో నిత్యామీనన్ అలనాటి మహానటి సావిత్రి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
 
నాకంటూ ఓ మ్యూజిక్‌ ట్రూప్‌
#నా వరకూ నాకు సినిమాలు ఒక్కటే ముఖ్యం కాదు. నా ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి. సినిమాలు మాత్రమే చూసుకుంటే వాటిని మిస్‌ అవుతున్నాననిపించింది. అందుకే సినిమాలను కొద్దిగా తగ్గించుకున్నాను. చాలా ప్రత్యేకం అనిపిస్తేనే చేస్తున్నాను.
 
#ఈ మధ్య ఏ సినిమా ఒప్పకోలేదు. నేను పాటలు పాడగలను. ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసే క్రమంలో సినిమాలకు దూరం అయ్యాను. నాకంటూ ఓ మ్యూజిక్‌ ట్రూప్‌ ఏర్పాటు చేసుకుంటున్నాను. త్వరలోనే ఓ మూడు సినిమాల్లో కనిపించబోతున్నాను.
 
#‘మహానటి’ సావిత్రిగారి పాత్ర చేయడం అంటే మాటలు కాదు. కథ కూడా చాలా బాగా చెప్పారు. విన్న వెంటనే ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా వదులుకోవలసి వచ్చింది. ‘ఎందుకు ఆ సినిమా వదులుకున్నానంటే’ మాత్రం ఇప్పుడు చెప్పలేను…అంటూ ‘మహానటి’ వదులుకోవడానికి కారణం? చెబుతూ..