అలాంటి పాత్రలే ఎక్కువ సంతృప్తినిస్తాయి !

నివేదా థామస్ ‘జెంటిల్ మేన్’, ‘నిన్నుకోరి’ …ఇప్పుడు ‘జై లవకుశ’ విజయాలతో  స్టార్ డమ్ తెచ్చేసుకుంది. టాలీవుడ్‌లో  అడుగుపెట్టగానే విజయాలు నమోదు చేయడం మొదలెట్టేసింది. ఆ మల్లూ సుందరికి ఛాలెంజింగ్ రోల్స్ అంటే ఇష్టమట. అవే తన డ్రీమ్ రోల్స్ అంటోది.  ఎన్ని సినిమాలు చేసినా తనకి మాత్రం ఛాలెంజింగ్ రోల్సే ఎక్కువ సంతృప్తినిస్తాయట. అలాంటి పాత్రల కోసం ఈ బ్యూటీ ఎదురుచూస్తోందట. ‘తను వెడ్స్ మను’లో కంగనా, ‘బర్ఫీ’లో ప్రియాంక, ‘బాజీరావు మస్తానీ’లో దీపిక చేసిన పాత్రల వంటివి కావాలంటోంది అమ్మడు. అవే తన డ్రీమ్ రోల్స్ అని అంటోంది.
టాలీవుడ్‌లో నివేదా అదృష్టం కొద్ది ‘జెంటిల్ మేన్’, ‘నిన్నుకోరి’ వంటి మంచి చిత్రాలు పడ్డాయి. గ్లామర్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే టాలీవుడ్‌లో ఈ తరహా గుర్తింపు ఉన్న పాత్రలు దక్కటం కూడా అదృష్టమే అన్నది చాలా మంది భావన. ఈ నేపథ్యంలో అమ్మడు కోరిన ఛాలెంజింగ్ పాత్రలు వచ్చినా రావచ్చంటున్నారు. నిజంగా అదే జరిగితే నివేదా కోరిక తీరినట్లే. మన ఇండస్ట్రీలో అలాంటి పాత్రలు ఎంత వరకూ సాధ్యమన్నది పక్కన పెడితే… నివేదా ఆసక్తిని అందరూ అభినందిస్తున్నారు .