సినిమాలు లేక కాదు.. అవకాశాలు రాక కాదు !

‘ఇదేమీ రన్నింగ్‌ రేస్‌ కాదు కదా! వెనుకపడిపోవడానికి. వరుస సినిమాలు చేయకపోవడానికి నా కారణాలు నాకు ఉన్నాయి. చదువు, కెరీర్‌ రెండూ బ్యాలెన్స్‌ చేసుకునే క్రమంలో నెమ్మదిగా సినిమాలు చేస్తున్నాను అంతేతప్ప…. సినిమాలు లేక కాదు. అవకాశాలు రాక కాదు. అయినా ఈ రంగం నాకేమీ కొత్త కాదు. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సు ఉన్నప్పటినుంచీ సినిమాలు చేస్తూనే ఉన్నాను’ అంటూ చెప్పింది నివేదా థామస్‌ …మీ తోటివారి తో పోలిస్తే రేస్‌లో వెనుకబడినట్టున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా
#తెలుగులో నాకు మంచి అవకాశాలే కాదు. మంచి నటులతో చేసే ఛాన్స్‌ కూడా దక్కింది.

తెలుగు అంత బాగా రాదు. ఎదుటివారు చెప్పేది పూర్తిగా అర్థమవుతోంది. చిన్న చిన్న పదాలు మాట్లాడగలుగుతున్నాను. గతం కన్నా నా భాష బాగా మెరుగు పడింది.
#నిన్న మొన్నటి దాకా నాది బిజీ షెడ్యూల్‌. ఓ పక్క చదువు. మరో పక్క సినిమాలతో క్షణం తీరికలేకుండా ఉన్నాను. ఇప్పుడు నా దృష్టి అంతా సినిమాల మీదే. ఎప్పుడన్నా కాస్త తీరిక దొరికితే బ్యాడ్మింటన్‌ ఆడుతుంటాను. ఇంకా సమయం దొరికితే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి కాఫీ తాగి వస్తుంటాను.
#నేను ఆర్కిటెక్చర్‌ చేశాను. నటి కాకపోయుంటే అందులోనే స్థిరపడేదాన్ని. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. సినీ ఫోటోగ్రాఫర్‌గా కూడా చేసేదాన్ని. ఇప్పుడయితే ఆ రెండూ చేసే ఆలోచనలు లేవు.