అతనితో పూర్తి స్థాయి డాన్స్‌ ప్రధాన చిత్రం ?

ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ సినిమా ఇంకా ఫైనల్‌ కాలేదు.ప్రస్తుతం అగ్ర హీరోలంతా వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌లను పైప్‌లైన్‌లో పెడుతున్నారు. దాదాపు రెండు, మూడేండ్ల వరకు బ్యాక్‌ టూ బ్యాక్‌ షూటింగ్‌లతో బిజీ బిజీగా గడపబోతున్నారు. కానీ ఎన్టీఆర్‌ నెక్ట్స్‌ సినిమా మాత్రం ఇంకా ఫైనల్‌ కాలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో నటిస్తున్న విషయం విదితమే. అనంతరం ఏ దర్శకుడితో నెక్ట్స్‌ సినిమా ఉంటుందనే సస్పెన్స్‌ నెలకొంది. కన్నడ దర్శకుడు ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు గతంలో వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. వీరి కాంబినేషన్‌లో డాన్స్‌ ప్రధానంగా సినిమా రానుందట. ఇందులో ఎన్టీఆర్‌ డాన్సర్‌గా కనిపిస్తారని టాక్‌. ఎన్టీఆర్‌లోని పూర్తి స్థాయి నాట్య ప్రతిభని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రశాంత్‌నీల్‌ ప్రస్తుతం కన్నడలో ‘కేజీఎఫ్‌ 2’ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివారులో వేసిన బ్రిడ్జ్‌ సెట్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అనంతరం డెహ్రాడూన్‌కి వెళ్ళనున్నట్టు సమాచారం. ఇందులో చరణ్‌ సరసన అలియాభట్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఎమ్మా రాబర్ట్స్‌ పేరు వినిపిస్తుంది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి.వి.వి. దానయ్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.