‘ముగ్గురు’ ఎన్టీఆర్ లకు మంచి బిజినెస్ !

 భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ ‘జైలవకుశ’.ఇందులో ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చెయ్యడంతో  చిత్రానికి  విశేషమైన క్రేజ్ వచ్చింది .

ఇటీవల విడుదలైన ఈసినిమా టీజర్ రికార్డులు సృష్టిస్తోంది.ముగ్గురు ఎన్టీఆర్ లు కనిపించనున్న ఈసినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఆడిపాడనున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాపై జనాల్లో ఆసక్తి బాగా పెరిగిపోవడంతో సినిమా థియేటర్ రైట్స్ కోసంపెద్ద రేంజ్ బిజినెస్ జరుగుతుందని తెలిసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్ రైట్స్ 70 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు సమాచారం. అదికూడా పోటీపడి కొన్నారని చెప్పుకుంటున్నారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాత . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమాను ఈ దసరాకు ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కొత్త రికార్డులు   నెలకొల్పడం  ఖాయం అంటున్నారు నందమూరి అభిమానులు.