ఈసారి ఆస్కార్ ఎవరిని వరిస్తుందో ?

సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో 90వ ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీలో నిలిచిన చిత్రాల వివరాలను ఆస్కార్‌ కమిటీ ప్రకటించింది. ‘డన్‌కిర్క్‌’, ‘ది పోస్ట్‌’ వంటి సంచలనాత్మక చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో పోటీ పడుతుండగా, డెంజెల్‌ వాషింగ్టన్‌, డానియెల్‌ కలూయా, గ్యారీ ఓల్డ్‌మేన్‌ వంటి వారు ఉత్తమ నటుల విభాగంలో బరిలో ఉన్నారు. క్రిస్టోఫర్‌ నోలన్‌, లేడీ డైరెక్టర్‌ గ్రెటా గెర్విగ్‌ వంటి డైరెక్టర్స్‌ దర్శకుల విభాగంలో ఆస్కార్‌ కోసం పోటీపడుతుండటం విశేషం. ఇక ఇందులో ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌ 13 నామినేషన్లను దక్కించుకోగా, ‘డన్‌కిర్క్‌’ ఎనిమిది, ‘త్రీ బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్కోరి’ ఏడు విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నాయి. ఈ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 4న జరుగనుంది. ఇక ఆయా విభాగాల్లో ఆస్కార్‌ కోసం పోటీపడుతున్న చిత్రాలు, నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు చూద్దాం….

ఉత్తమ చిత్రం : ‘డార్కెస్ట్‌ అవర్‌’, ‘డన్‌కిర్క్‌’, ‘ఫాంటమ్‌ థ్రెడ్‌’, ‘గెట్‌ ఔట్‌’, ‘ది పోస్ట్‌’, ‘థ్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ’, ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’, ‘లేడీ బర్డ్‌’, ‘కాల్‌ మి బై యువర్‌ నేమ్‌’ ఉత్తమ చిత్రాలుగా ఆస్కార్‌ బరిలో నిలిచాయి.

ఉత్తమ దర్శకుడు: గుల్లెర్మో డెల్‌ టోరో (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), క్రిస్టోఫర్‌ నోలన్‌ (డన్‌కిర్క్‌), గ్రెటా గెర్విగ్‌(లేడీ బర్డ్‌), జోర్డాన్‌ పీలే (గెట్‌ ఔట్‌), పాల్‌ థామస్‌ ఆండర్సన్‌ (ఫాంటమ్‌ థ్రెడ్‌).

ఉత్తమ నటుడు : డానియెల్‌ కలుయా(గెట్‌ ఔట్‌), థిమోతి చలమెట్‌ (కాల్‌ మి బై యువర్‌ నేమ్‌), గారి ఓల్డ్‌మాన్‌(డార్కెస్ట్‌ అవర్‌), డానియెల్‌ డే లూయిస్‌(ఫాంటమ్‌ థ్రెడ్‌), డెంజెల్‌ వాషింగ్టన్‌(రొమన్‌ జె.ఇజ్రాయిల్‌, ఎస్క్‌).

ఉత్తమ నటి : ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్‌మాండ్‌(త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌,మిస్సోరీ), మెరిల్‌ స్ట్రీప్‌ (ది పోస్ట్‌), సాలీ హాకిన్స్‌ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), సాయోర్స్‌ రోనన్‌(లేడీ బర్డ్‌), మార్గాట్‌ రాబీ (ఐ, టోన్యా).

ఉత్తమ సహాయ నటుడు: క్రిస్టోఫర్‌ ప్లమ్మర్‌ (ఆల్‌ ది మనీ ఇన్‌ ది వరల్డ్‌), వూడీ హెర్రీల్సన్‌(త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌,మిస్సోరీ), సామ్‌ రాక్‌వెల్‌ (త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌,మిస్సోరీ), విలియమ్‌ డఫూ (ది ఫోరిడా ప్రాజెక్ట్‌), రిచర్డ్‌ జెన్‌కిన్స్‌(ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌).

ఉత్తమ సహాయ నటి: లెస్లీ మాన్విల్లె (ఫాంటమ్‌ థ్రెడ్‌), లారీ మెట్కాఫ్‌ (లేడీ బర్డ్‌), అల్లిసన్‌ జానీ(ఐ, తోన్య), మేరి జె.బ్లిజ్‌(మడ్‌బౌండ్‌), ఆక్టేవియా స్పెన్సర్‌(ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌).

యానిమేషన్స్‌ ఫిల్మ్‌: ‘ది బ్రీడ్‌విన్నర్‌’, ‘లవింగ్‌ విన్సెంట్‌’, ‘కోకో’, ‘ది బాస్‌ బేబీ’, ‘ఫెర్డినాండ్‌’.

సినిమాటోగ్రఫీ: బ్రూనో డెల్బన్నెల్‌ (డార్కెస్ట్‌ అవర్‌), హార్టు హోయిటెమా(డన్‌కిర్క్‌), రాచెల్‌ మొర్రిసన్‌(మడ్‌బౌండ్‌),డాన్‌ లాస్ట్సెన్‌(ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), రోజర్‌ డేకిన్స్‌(బ్లేడ్‌రన్నర్‌ 2019).

కాస్ట్యూమ్‌ డిజైన్‌: లూయిస్‌ సెక్యూరా (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), జాక్వెలిన్‌ డిరాన్‌(బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌, డార్కెస్ట్‌ అవర్‌), మార్క్‌ బ్రిడ్జెస్‌ (ఫాంటమ్‌ థ్రెడ్‌), కాన్సోలేటా బోరులే(విక్టోరియా అండ్‌ అబ్దుల్‌).

విదేశీ భాషా చిత్రం: ‘ది స్వ్కైర్‌'(స్వీడన్‌), ‘ఆన్‌ బాడీ అండ్‌ సోల్‌’ (హంగేరీ), ‘ది ఇన్‌సల్ట్‌'(ఫ్రెంచ్‌-లెబనీస్‌), ‘ఏ ఫెంటాస్టిక్‌ ఉమెన్‌'(చిలియన్‌), ‘లవ్‌లెస్‌'(రష్యన్‌).

డాక్యుమెంటరీ చిత్రం: ‘ఐకారస్‌’, ‘అబాకస్‌: స్మాల్‌ ఇనఫ్‌ టు జైల్‌’, ‘లాస్ట్‌ మెన్‌ ఇన్‌ అలెప్పో’, ‘స్ట్రాంగ్‌ ఐలాండ్‌’, ‘ఫేసెస్‌ ప్లేసెస్‌’.

లఘు చిత్రం: ‘నైఫ్‌ స్కిల్స్‌’, ‘హెవెన్‌ ఈజ్‌ ఏ ట్రాఫిక్‌ జామ్‌ ఆన్‌ ది 405’, ‘హీరోయిన్‌(ఈ)’, ‘ట్రాఫిక్‌ స్టాప్‌’.

ఎడిటింగ్‌: లీ స్మిత్‌(డన్‌కిర్క్‌), టటియానా ఎస్‌.రిగెల్‌ (ఐ, టోన్యా), పాల్‌ మచ్లిస్‌ అండ్‌ జోనాథన్‌ అమోస్‌(బేబేఈ డ్రైవర్‌), సిడ్నీ వాలినిస్కీ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), జాన్‌ గ్రెగరీ(త్రీ బిలిబోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ).

మ్యూజిక్‌ ఒరిజినల్‌ స్కోర్‌: జానీ గ్రీన్యుడ్‌ (ఫాంటమ్‌ థ్రెడ్‌), జాన్‌ విలియమ్స్‌ (స్టార్‌ వార్స్‌: ది లాస్‌ జెడీ), కార్టర్‌ బుర్వెల్‌(త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ), అలెగ్జాండర్‌ డెస్‌ప్లాట్‌ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), హాన్స్‌ జిమ్మర్‌ (డన్‌కిర్క్‌).

మేకప్‌, హెయిర్‌ స్టయిల్‌: డానియల్‌ ఫిలిప్స్‌, లౌ షెప్పర్డ్‌ (విక్టోరియా అండ్‌ అబ్దుల్‌), కజుహిరో, సుజీ, డేవిడ్‌ మలినోవ్స్కీ, లూసీ సిబ్బిక్‌ (డార్కెస్ట్‌ అవర్‌), అర్జెన్‌ థైటెన్‌(వండర్‌).

విజువల్‌ ఎఫెక్ట్స్‌: స్టీఫెన్‌ రోసెన్బామ్‌, జెఫ్‌ వైట్‌, స్కాట్‌ బెన్జా, మైక్‌ మేనార్డస్‌(కాంగ్‌: స్కల్‌ ఐల్యాండ్‌), క్రిస్టోఫర్‌ టౌన్సెండ్‌, గై విలియమ్స్‌, జోనాథన్‌ ఫాక్నర్‌, డాన్‌ సుడిక్‌(గార్డియన్స్‌ ఆఫ్‌ ది గాలాక్సీ వాల్యూం 2), జో లెటేరి, డానియల్‌ బారెట్‌, డాన్‌ లెంమాన్‌, జోయెల్‌ విస్ట్‌(వార్‌ ఫర్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌), జాన్‌ నెల్సన్‌, గెర్డ్‌ నెఫెర్‌, పాల్‌ లాంబెర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌.హోవర్‌ (బ్లేడ్‌ రన్నర్‌ 2049), బెన్‌ మోరిస్‌, మైక్‌ మల్హోలాండ్‌, నీల్‌ స్కాన్లాన్‌, క్రిస్‌ కార్బౌల్డ్‌ (స్టార్‌ వార్స్‌: ది లాస్ట్‌ జెడీ).

ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: గుర్లెర్మో డెల్‌ టోరో, వెనెస్సా టేలర్‌ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌), మార్టిన్‌ మక్డోనాగ్‌ (త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ), ఎమిలీ వి.గోర్డాన్‌, కుమాయిల్‌ నాజియాని (ది బిగ్‌ సిక్‌), జోర్డాన్‌ పీలె( గెట్‌ ఔట్‌), గ్రెటా గెర్విగ్‌ (లేడీ బర్డ్‌).

అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: విర్గిల్‌ విలియమ్స్‌, డీ రీస్‌(మడ్‌బౌండ్‌), స్కాట్‌ న్యూస్టాడర్‌, మైఖేల్‌ హెచ్‌.వెబెర్‌(ది డిజాస్టర్‌ ఆర్టిస్ట్‌), జేమ్స్‌ ఇవరీ(కాల్‌ మి బై యువర్‌ నేమ్‌), స్కాట్‌ ఫ్రాంక్‌, జేమ్స్‌ మంగోల్డ్‌, మైఖేల్‌ గ్రీన్‌ (లోగాన్‌), ఆరోన్‌ సోర్కిన్‌(మోలీస్‌ గేమ్‌). దీంతోపాటు సౌండ్‌ మిక్సింగ్‌, సౌండ్‌ ఎడిటింగ్‌, షార్ట్‌ ఫిల్మ్‌ లైవ్‌ యాక్షన్‌, షార్ట్‌ ఫిల్మ్‌ యానిమేషన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, మ్యూజిక్‌(ఒరిజినల్‌ సాంగ్‌) విభాగంలో పలు చిత్రాలు, టెక్నీషియన్లు ఆస్కార్‌ కోసం పోటీపడుతున్నారు.

పలు క్రేజీ చిత్రాలు ఈ ఆస్కార్‌ బరిలో నిలవడంతో ఏ చిత్రానికి, ఏ నటీనటులకు, ఏ టెక్నీషియన్లకు అవార్డులు వస్తాయో అని  సినీలోకమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.