మన వాళ్ళూ ఆస్కార్ కి ఓటేస్తారు !

ఆస్కార్‌ అవార్డుల ఎంపికకు  దాదాపు 57 దేశాలకు చెందిన సినిమా ప్రముఖులు  ఓటింగ్‌లో పాల్గొంటారు.అందులో 39 శాతం మంది మహిళలు ఉండటం గమనార్హం.  ఈ సారి   అమితాబ్‌బచ్చన్‌, ఆమిర్‌ఖాన్‌తో పాటు మనదేశం నుండి  ఆస్కార్‌ అవార్డు లకు ఓటేసేందుకు ఆహ్వానం లభించింది.  మన దేశం నుంచి సినీ ప్రముఖులు ప్రియాంకా చోప్రా, ఐశ్వర్య రాయ్‌, సల్మాన్‌ఖాన్‌, ఇర్ఫాన్‌ ఖాన్‌, దీపికా పదుకొనే, గౌతమ్‌ ఘోష్‌, బుద్ధదేవ్‌ దాస్‌ గుప్త, అర్జున్‌ భాసిన్‌, సోనీ తారాపూర్‌వాలా, ఆనంద్‌ పట్వర్దన్‌కూ ఆహ్వానం అందింది. “ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌” అధ్యక్షుడు చెరిన్‌ బూన్‌ ఇసాక్స్‌ మాట్లాడుతూ… ‘‘అకాడెమీకి కొత్తవారిని ఆహ్వానించడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.