హైప్ తగ్గిందంటూ గతంలో ఇచ్చిన ఆఫర్స్ కి ‘నో’

ఓటిటి లో టెలికాస్ట్ కు మొన్నటి వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలకు భారీ రేట్లు ఆఫర్ చేశాయి. సినిమా మీద హైప్ తగ్గిపోవడంతో ఇచ్చింది తీసుకుని, నాని ‘వి’ మూవీ ఓటిటి లో రిలీజ్ అనౌన్స్ చేయడంతో..ఇప్పుడు ఓటిటి వారు గతంలో ఇచ్చిన ఆఫర్స్ కి నో చెబుతున్నారట.
 
రెండు మూడు సినిమాల విషయంలో గతంలో ఇచ్చిన ఆఫర్స్ కి నో చెప్పిన వార్తలే రాగా.. ఇప్పుడు మరో చిన్న సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కి కూడా ఇదే జరిగిందని అంటున్నారు.
ఈ సినిమా ను సుమారు 4.5 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారు. సినిమాకి ఏప్రిల్ లో ఓటిటి లో 6.5 కోట్ల రేంజ్ ఆఫర్లు వచ్చాయి.అనుప్ రూబెన్స్ సంగీతంలో ఈచిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట యు ట్యూబ్ లో పెద్ద రికార్డ్ సృష్టించింది. ప్రదీప్ హీరోగా లాంచ్ అవుతున్న సినిమా కూడా అవ్వడంతో నిర్మాతలు ‘మరికొంత కాలం ఆగుదాం’ అనుకుని.. సినిమా డిజిటల్ రిలీజ్ కి ‘నో’ చెప్పారు. ఇక నాని’ వి’ సినిమా ఓటిటి లో విడుదల చెయ్యాలనే నిర్ణయం తర్వాత.’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ టీం కూడా ఓటిటి కే ఓకే అనుకుని .. ముందు ఆఫర్ ఇచ్చిన వాళ్ళని కాంటాక్ట్ చేస్తే.. ఇప్పుడు ఆ రేటు ఇచ్చుకోలేమని చెప్పారట. దాంతో ఈ సినిమా కి కూడా షాక్ తగిలినట్లు అయింది. ఇప్పుడు వేరే ఓటిటి యాప్స్ లో బెటర్ ఆఫర్ ఎవరు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారట.
ఓటిటి లో చేస్తే ‘ఉప్పెన’కు సగం లాస్ ?
సాయి ధరమ్ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన మూవీ ‘ఉప్పెన’. సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సన ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోయిన్‌ కృతి శెట్టికి కూడా ఈ సినిమా మొదటి కావడం విశేషం. అయితే వీరందరూ కొత్త వాళ్లు అయినప్పటికీ ఇందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్ర పోషించడం, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ అందించడం, సుకుమార్‌ రైటింగ్స్ – మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించడంతో..  అందరిలోనూ మంచి అంచనాలున్నాయి. రెండు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో.. సినిమాపై ఆసక్తి కలిగింది.పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తయిన ఈ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండగా థియేటర్ల బంద్ వల్ల రిలీజ్ ఆగిపోయింది.అయితే ఓటిటి ఆఫర్స్ వస్తున్నా మేకర్స్ మాత్రం థియేటర్ రిలీజ్ కే ప్రిఫర్ చేస్తున్నారట.
ఈ సినిమాకు బడ్జెట్ లెక్కలేమి వేసుకోకుండా ఖర్చు పెట్టుకుంటూ పోయేసరికి పాతిక కోట్ల దాకా అయ్యిందని తెలుస్తోంది.ఇప్పుడు ఆ పాతిక కోట్లు ఓటిటి ల ద్వారా రావు. ఈ సినిమాకు అమెజాన్ ప్రైం 13 కోట్ల ఆఫర్ ఇచ్చిందట. అయితే సినిమా బడ్జెట్ లో సగం మాత్రమే డిజిటల్ రైట్స్ రావడంతో నిర్మాతలు డీలా పడ్డారని తెలుస్తుంది. మెగా బ్యాక్ గ్రౌండ్ ఉండబట్టే.. కనీసం అంత రేటైనా వచ్చింది. కాని కొత్త హీరో సినిమాకు అంత ఇచ్చేఅవకాశం లేదని అంటున్నారు.మేకర్స్ ఆలోచనలో మార్పు వచ్చి ఓటిటికి 13 కోట్లకు ఓకే చెప్పినా.. సగం దాకా లాస్ తప్పదని అంటున్నారు. అందుకే థియేటర్లు ఓపెన్ అయ్యాకే ‘ఉప్పెన’ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.