అందాల నాయికలందరినీ వెనక్కి నెట్టేసింది !

‘చెన్నై టైమ్స్’ మోస్ట్ డిజైరబుల్ ఉమన్ ఇన్ 2017 ఆన్ లైన్ పోల్‌లో ఓవియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పట్టుమని పది సినిమాలు చేయలేదు… హీరోయిన్‌గా అంత క్రేజ్‌ కూడా లేదు… అయినా దక్షిణాది అగ్రతార నయనతారనే వెనక్కి నెట్టేసి సంచలనం సృష్టించింది ఓవియా. తాజాగా దక్షిణాదిలో టాప్‌ 30 హీరోయిన్ల గురించి ఒక సంస్థ జరిపిన సర్వేలో.. ఓవియాకు తొలి స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అగ్రస్థానంలో ఉన్న నయనతార రెండో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, 4వ స్థానంలో శ్రద్ధా, 5వ స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ నిలిచారు. అయితే ‘మైనా’ భామ అమలాపాల్‌, ముంబై బ్యూటీ హన్సిక వరుసగా 13, 16 స్థానాల నుండి 28, 30 స్థానాలకు పడిపోయారు. ఈ లిస్టులో హన్సికనే ఆఖరులో నిలవడం గమనార్హం. సర్వే గురించి ఓవియా దగ్గర ప్రస్తావిస్తే.. ‘అయ్యో.. నాకు అస్సలు నమ్మబుద్ధికావడం’ అని ఎగిరి గంతేసిందట.
ఓవియా మాతృభాష మలయాళం అయినా ‘కలవాణి’తో కోలీవుడ్‌కు పరిచయమై, ఇక్కడే సెటిలైపోయింది. హీరోయిన్‌గా అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తుండడంతో దాదాపుగా రేసులో నుండి తప్పుకుంది. ఆ సమయంలో ‘బిగ్‌బాస్‌’ రియాల్టీ షో ఆమె పాలిట వరంలా మారింది. గతేడాది ప్రసారమైన ఈ షో పుణ్యమాని ఓవియా క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఎంతగా అంటే.. కోలీవుడ్‌ యూత్‌ అంతా ఇప్పుడు ఆమె వెనుకే పడుతున్నారు.పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతోన్నా రాని గుర్తింపు ‘బిగ్ బాస్’ షోతో దక్కించుకుంది ఒవియా. కేరళలో పుట్టిపెరిగిన ఈ అమ్మడు తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా సెటిల్ అయిపోయింది. మీడియం హీరోల చిత్రాల్లో కథానాయిక అలరిస్తోన్న ఈ అమ్మడికి.. తమిళ ‘బిగ్ బాస్’ రూపంలో పెద్ద ఆఫర్ వచ్చింది. ‘బిగ్ బాస్’షోలో తన తోటి పార్టిసిపెంట్ ఆరవ్‌తో లవ్ స్టోరీ నడిపిన ఒవియా.. ఆ తర్వాత సూసైడ్ ఎటెంప్ట్ వంటి ట్విస్ట్స్‌తో.. సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ షోలో విజేతగా నిలవకపోయినా ఆడియెన్స్ మనసు గెలుచుకోవడంలో మాత్రం సఫలీకృతురాలైంది. అలా ‘బిగ్ బాస్’తో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న ఒవియాకు ఇప్పుడు అరుదైన ఘనత దక్కింది. ఇక ఇటీవలే తరుణ్ సరసన ‘ఇది నా లవ్ స్టోరీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఒవియా.. ప్రస్తుతం లారెన్స్ సరసన ‘ముని-4’తో పాటు మరో ఐదు తమిళ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉంది. మొత్తంమీద ఆన్ లైన్ పోల్‌లో ఆడియెన్స్ మనసు దోచుకున్న ఈ సుందరి త్వరలోనే మీడియం రేంజ్ హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందేమో ….