హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్, సహస్ర మూవీస్ పతాకాలపై నిర్మాతలు శ్రీనుబాబు పుల్లేటి, సత్తిబాబు మోటూరి నిర్మిస్తోన్న అందమైన ప్రేమ కథా చిత్రం `ఓయ్ ఇడియట్`. న్యూ ఏజ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంకర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… యంగ్ టీమ్ అందరూ కలసి చేసిన ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ `ఓయ్ ఇడియట్`. దర్శకుడు వెంకట్ కడలి టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద ఆహ్లాదకరంగా చూపించారు. ఈ సినిమాకు మంచి సంగీతం కుదిరింది. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంకర్ వారి పాత్రలలో చక్కగా నటించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటుల అవసరం ఎంతో ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మంచి సహకారం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో విడుదల తేధిని ప్రకటిస్తాం. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి మా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాం“అన్నారు.
నటీనటులు:
యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంకర్,
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్, సహస్ర మూవీస్
నిర్మాతలు: శ్రీనుబాబు పుల్లేటి, సత్తిబాబు మోటూరి
డైరెక్టర్: వెంకట్ కడలి
మ్యూజిక్: జికెవి
ఎడిటర్: నాని కాసరగడ్డ
కెమెరామెన్: సతీష్ నాయక్