పా.విజయ్ ‘ఆరుద్ర’ విడుదలకు సిద్ధం!

సామాజిక ఇతివృత్తంతో తమిళంలో ఇటీవల విడుదలై విమర్శకుల ప్రశంసలందుకున్న ‘ఆరుద్ర’ చిత్రాన్ని అదే పేరుతో జె.ఎల్‌.కె. ఎంటర్‌ ప్రైజెస్‌ అధినేత కె.వాసుదేవరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.తమిళంలో రచయితగానే కాకుండా నటుడిగా, దర్శకనిర్మాతగా పా.విజయ్ కు మంచి పేరుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆరుద్ర’. ఇందులో మరో ప్రముఖ నటుడు కె.భాగ్యరాజా కీలక పాత్ర పోషించారు. మేఘాలీ, దక్షిత , సోని, సంజన సింగ్‌ హీరోయిన్స్‌గా నటించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
చిత్ర నిర్మాత కె.వాసుదేవరావు మాట్లాడుతూ…‘‘తమిళంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో చైల్డ్‌ అబ్యూస్‌మెంట్‌ పై రూపొందిన చిత్రమిది. ఇందులో పిల్లలకు, పేరెంట్స్‌కు మంచి సందేశం ఇచ్చారు. గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌ గురించి అందరికీ అర్థమయ్యేలా దర్శకుడు చూపించారు. వీటితో పాటు లవ్‌, కామెడీ మరియు ఎమోషన్స్‌ ఇలా అన్ని వర్గాలకు నచ్చే అంశాలున్నాయి. తమిళంలో ఇటీవల విడుదలై క్రిటిక్స్‌తో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ కాబట్టి తెలుగులోకి అనువదిస్తున్నాం. పా.విజయ్‌ దర్శకత్వం, విద్యాసాగర్‌ సంగీతం, కె.భాగ్యరాజా గారి క్యారక్టర్‌ సినిమాకు హైలెట్స్‌ గా ఉంటాయి.
సామాజిక ఇతివృత్తంతో సందేశాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం నాగరికులకు.. ఒక హెచ్చరిక. అనాగరికులకు..ఒక గుణపాఠం. మానవ మృగాలకు సింహ స్వప్నం. నిన్న, నేడు, రేపు, దిశ, నిర్భయ, సంఘటన తరహాలో మహిళలకు, ఆడ పిల్లలకు జరుగుతున్న అమానుష చర్యలకు ప్రతీకార దిశగా ఈ చిత్రం ఉంటుంది. సకుటుంబ సమేతంగా తప్పనిసరిగా చూడవసిన చిత్రం. ‘ఆరుద్ర’ అనగా ఉగ్రరూపం, బీభత్సం, సునామి, భయానక దృశ్యం, ఆడ పిల్లలకు మహిళలకు అభయ హస్తం. చివరికి మానవ మృగాలను అంతమొందించడమే ఈ చిత్రం కథ. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి సమర్పణ: వరకాంతం సునిల్‌ రెడ్డి: సంగీతం: విద్యాసాగర్‌, నిర్మాత: కె.వాసుదేవరావు; దర్శకత్వం: పా.విజయ్‌.