పాయల్ రాజ్‌పుత్‌ `RDX ల‌వ్‌` అక్టోబ‌ర్ 11న

పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ ప్ర‌ధాన పాత్ర‌లలో శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌ణలో హ్యపీ మూవీస్ సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం `RDX ల‌వ్‌`. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు .
టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌తో పాయ‌ల్ఆక‌ట్టుకున్నారు. సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. కీల‌క పాత్ర‌ల్లో న‌రేశ్‌, నాగినీడు, తుల‌సి, ఆమ‌ని న‌టిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం .సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ .
 
ఆదిత్య మీనన్, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు నటిస్తున్నారు.కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను, నిర్మాత: సి.కల్యాణ్, కో ప్రొడ్యూసర్: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా, డైలాగ్స్: పరుశురాం, ఎడిటర్: ప్రవీణ్ పూడి