`స‌ప్త‌గిరి ఎల్‌.ఎల్‌.బి` చిత్రాన్ని చూసిన పార్ల‌మెంట్ స‌భ్యులు

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’. హిందీలో సూపర్‌డూపర్‌ హిట్‌గా నిలిచిన ‘జాలీ ఎల్‌.ఎల్‌.బి’కి రీమేక్‌ ఇది. సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై ప్రముఖ హోమియోపతి వైద్యులు, టేస్ట్‌ఫుల్‌ నిర్మాత డా. రవికిరణ్‌ చరణ్‌ లక్కాకులని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’. డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌, డా. శివప్రసాద్‌ ముఖ్య పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 7న విడుద‌లైంది. ఇటీవ‌ల ఈ సినిమా స్పెష‌ల్ షోను ఢిల్లీలో పార్ల‌మెంట్ స‌భ్యుల కోసం ప్ర‌ద‌ర్శించారు. డా.ఎన్ శివ‌ప్ర‌సాద్‌తో పాటు, సుజనా చౌద‌రి, ముర‌ళీ మోహ‌న్‌, మాగంటి బాబు, గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్మోహ‌న్ నాయుడు, నిర్మాత డా.ర‌వికిర‌ణ్ త‌దితరులు ఈ షోను వీక్షించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ చితం లో ఎం.పి. శివప్రసాద్ నటన చాలా బాగుందని ప్రశంసించారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన డా.రవికిరణ్ ను అభినందించారు.