‘పాటల పల్లకి’ ఆధ్వర్యం లో ఫ్రీ మెడికల్ క్యాంపు

శ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న ‘పాటల పల్లకి’. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎంతో మంది నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో ‘మొగుడ్స్పెళ్ళాంస్’ చిత్ర సంగీత దర్శకుడు రాజ కిరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ పాటల పల్లకి టీమ్ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ మూసాపేటలోని ప్రిన్స్ స్కూల్ ఆధ్వర్యంలో యువ సేన గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా…
 
నిర్మాత చిన్న మల్లయ్య మాట్లాడుతూ… రాజ్ కిరణ్ సంగీత సారధ్యంలో పాటల పల్లకి అనే ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాము. ఇటీవలే ఈ కార్యక్రమానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఫ్రీ మెడికల్ క్యాంపును నేడు నిర్వహించడం జరిగింది. ఇట్టి ఫ్రీ సేవకు సహకరించిన డాక్టర్ల కు, ప్రిన్స్ స్కూల్ యాజమాన్యం కు, మా చిత్ర యూనిట్ కు నా ధన్యవాదాలు లెలియచేస్తున్నాను.. ఇదేవిధంగా రాబోయే కాలంలో కూడా మా పాటల పల్లకి ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి సహాయ సహకారాలను అందిస్తామని, అలానే ప్రతి జిల్లా మరియు గ్రామాల్లో కూడా వివిధ రకాల పాటలను సేకరించి కొత్త గాయనీ గాయకులు అవకాశం కల్పించి మా వంతు సేవను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియచేస్తున్నా… అతి త్వరలో ఈ మా పాటల పల్లకి ప్రోగ్రామ్ ఓ ఛానల్ ద్వారా ప్రసారం కానుంది.. ఇంత మంచి ప్రోగ్రామ్ ను ప్రజలందరూ ఆశీర్వదించి ఆదరించాలని కోరుతున్నా అన్నారు.
జయరాజ్ మాట్లాడుతూ… ఈ మెడికల్ క్యాంపు కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు.. దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడబడుతున్న మన తెలుగుదనం వెస్ట్రన్ సాహిత్యంతో మరుగునపడి పోతోంది.. దాన్ని కాపుడుకోవడానికే పాటల పల్లకి ప్రోగ్రామ్ ను మరియు మెడికల్ క్యాంపు ను నిర్వహించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా సమాజాన్ని మేల్కొల్పాలనే ప్రయత్నం భవిష్యత్తులో కూడా చేస్తూ ఉంటామని తెలియచేస్తున్నామన్నారు.
 
రాజ్ కిరణ్ మాట్లాడుతూ… పది రోజుల క్రితం ఈ పాటల పల్లకి ప్రోగ్రామ్ ను నిర్వహించాము.. మంచి స్పందన లభించింది. అందరికీ రీచ్ కూడా అయ్యింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా
ఎంతో మంది న్యూ సింగర్స్ ను పరిచయం చేయనున్నాము. కొత్త టాలెంట్ ను వెలికితీసే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే చాలా ముందుకి రీచ్ అవ్వాలనే నేడు ఫ్రీ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ పాటల పల్లకి ద్వారా అలనాడు మహా సంగీత దర్శకులు సమకూర్చిన అద్భుతమైన బాణీలను చిరస్థాయిగా బావి తరాల వారికి కూడా నిలిచి ఉండాలనే ఆశతో అలనాటి పాటలను మరల సమకూర్చి మా ‘పాటల పల్లకి’ ద్వారా పాడాలని ఆశక్తి కలిగి, పాడగల ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించి తద్వారా ఎంతో మందికి ఆర్థికంగా కొంచెం సహాయ పడాలనే ఉద్ధ్యంతో ముందుకు సిద్ధం అవుతోంది మా పాటల పల్లకి ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహిస్తున్న ఎస్ కేశవ ఎంతో మంచి కాన్సెప్ట్ ను అందించాడు.. మాతమూరి రామారావు రచయితగా వ్యవహరించారు.. ఎన్నో మంచి సినిమాలకు అధ్బుతంగా లిరిక్స్ ను అందించారు.. అలానే ఈ కాన్సెప్ట్ గురుంచి చెప్పగానే నిర్మాతలు బాబు రాజు, చిన్న మల్లయ్య, నందికంటి బాబురావులు ఎంతో మంది కొత్త వారిని ప్రోత్సహించాలని ముందుకు వచ్చి, బోల్ బేబీ బోల్, పాడాలని ఉంది లాంటి ప్రోగ్రామ్స్ కంటే మెరుగ్గా ఈ పాటల పల్లకి ఉండాలనే ఉత్సాహంతో మాకు సహరించారు. అందుకు వారికి కృతఙ్ఞతలు తెలియచేస్తూన్నా .. అలానే ఈ రెండు రాష్టాల నుంచి కొత్త టాలెంట్ ఉన్న వారిని వెలికి తీసి వారిచే పాటలపల్లకి ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసి ఛానల్ కు వెళ్తాము. ఇక ఈ ఫ్రీమెడికల్ క్యాంపుకు సంహరించిన డాక్టర్స్ జగన్ భరత్ కుమార్ లకు, ప్రిన్స్ స్కూల్ నిర్వాకులకు నా కృతఙ్ఞతలు అని అన్నారు..
 
డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ… ఈ పాటల పల్లకి ప్రోగ్రామ్ ద్వారా ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించాలనే చెప్పగానే ఇక్కడ వారందరూ మాకెంతో సపోర్ట్ ను అందించారు. జిల్లాల వారీగా పాటల పల్లకి ప్రోగ్రామ్ కు ఆడిషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ను చెప్పగానే చిన్న వాడినైనా నన్ను నమ్మి ముందుకు వచ్చిన నిర్మాతలకు కృతఙ్ఞతలు అన్నారు.
 
వెంకీ, మహేష్, నందికంటి బాబు రావు, మాతమూరి రామారావు, డాక్టర్స్ గుప్తా, డా. భరత్ తదితరులు ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు కార్యాలయంలో పాల్గొన్నారు..
 
‘పాటల పల్లకి’ ప్రోగ్రామ్ కు నిర్మాత: కె. చిన్న మల్లయ్య, సహ నిర్మాత: నందికంటి బాబు రాజు, దర్శకత్వం: ఎస్. కేశవ్, సంగీతం: ఎస్. రాజ్ కిరణ్, రచన: రామారావు మాతుమూరు, మేనేజ్మెంట్: వి ఎస్. చారి.