దీపావళి కానుకగా అక్టోబర్ 19న పవన్ , త్రివిక్రమ్ సినిమా

ఇప్పటికే “జల్సా”, “అత్తారింటికి దారేది” వంటి వరుస హిట్స్‌ను అందుకున్న పవన్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో  తాజా చిత్రం   శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. దసరా సీజన్‌లో వస్తుందనుకున్న ఈ సినిమా ఇప్పుడు మరో ఫెస్టివల్‌ను టార్గెట్ చేస్తోంది. పవన్, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇక ఈ చిత్రం..రిలీజ్ డేట్‌పై ఇప్పటి వరకూ  సస్పెన్స్ నెలకొంది. మొదట దసరాకు వస్తుందని ప్రచారం చేసినా.. ఆ సీజన్‌లో ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవడంతో పవన్ సినిమాఆ తరువాతి ఫెస్టివల్ దీపావళి కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది.

సాఫ్ట్‌వేర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ సాఫ్ట్‌వేర్ ఎనలిస్ట్‌గా డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తాడట. ఈ చిత్రంలో సాఫ్ట్‌వేర్ రోల్ కోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లు. విక్టరీ వెంకటేష్ ఈ మూవీలో పవర్ స్టార్ అంకుల్ రోల్‌లో అతిధిగా కనిపించడం విశేషం. త్రివిక్రమ్ ఆస్థాన నిర్మాత ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.