నలభై రోజుల్లోనే షూటింగ్ పూర్తిచేస్తారట !

 ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న  ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఈ సినిమా తర్వాత ఇప్పట్లో మరో సినిమా చేయడని, ‘జనసేన’ పార్టీ ప్రచారంలో బిజీ అయిపోతాడని అనుకున్నారు పవన్ అభిమానులు. అయితే ఏదిఏమైనా ప్రచారానికి బయల్దేరే లోపే త్రివిక్రమ్ మూవీతో పాటు మరో సినిమా కూడా పూర్తి చేయాలని పవన్ నిర్ణయానికి వచ్చాడట.సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పిన పవన్ ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేసేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో రానున్న ఈచిత్రాన్ని ఎన్నికల హడావుడి రాకముందే పూర్తి చేసేట్టుగా ప్లాన్ రెడీ చేశాడని సమాచారం. ఇందుకోసం కేవలం 40 రోజుల కాల్షీట్లు మాత్రమే కేటాయించాడట పవన్. ఆ 40 రోజుల్లోనే త్వరత్వరగా షూటింగ్ పూర్తిచేస్తారని.. ఆ తర్వాతే ఆయన ‘జనసేన పార్టీ’ పనుల్లో నిమగ్నమై పోతారని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈసినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును పరిశీలిస్తున్నారు.