పవన్ కళ్యాణ్ ఆడియో ఆల్బ‌మ్ సాంగ్ విడుదల !

ఎస్.ఎన్. ఆర్ట్ క్రియేష‌న్స్ ఆధ్వ‌ర్యంలో రాజ్ కిర‌ణ్ సంగీత‌ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త‌ 22 చిత్రాల‌ను ఆదారంగా చేసుకొని గీత‌ ర‌చ‌యిత‌ రామారావు రాసిన‌ ఒక‌ అధ్భుత‌మైన‌ ఆడియో ఆల్బ‌మ్ సాంగ్ రూపొందించ‌డం  జ‌రిగింది   ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరున‌ ఈ ఆల్బమ్ రూపొందించ‌డం జ‌రిగింది దీనిని ఈరోజు ‘లైక్ అండ్ షేర్’ స్టూడియోలో పాట‌ను ఆవిష్క‌రించ‌డం జ‌రిగింది ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య‌ అతిథిగా తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ చైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ మ‌రియు యూనిట్ స‌మ‌క్షంలో పాట‌ను లాంచ్ చేసారు.
             ఈ సంధ‌ర్భంగా రామ‌క్రిష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ…
             ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన‌ 22 చిత్రాల‌ను బేస్ చేసి రామారావు మంచి లిరిక్ రాయ‌డంతో పాటు రాజ్ కిర‌ణ్ అద్భుత‌మైన‌ ట్యూన్ తో మంచి సంగీతాన్ని అందించారు ఈ సాంగ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద‌ పండ‌గ‌ లాంటిది ఇలాంటి ఆలోచ‌న‌ తో సాంగ్ రూపొందించిన‌ ఎస్.ఎన్.ఆర్ట్ క్రియేష‌న్స్ యూనిట్ కి త‌న‌ అభినంద‌న‌లు తెలియ‌జేసారు.
             మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ…
             ఈ పాట‌ను నేను ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానిలా ఫీల్ అవుతూ చేసాను.  ఈ పాట‌ను ఆవిష్క‌రించిన‌ రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారికి ధ‌న్య‌వాదాలు . చిన్న‌ సినిమాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచే రామ‌క్రిష్ణ‌ గౌడ్ గారు మ‌మ్మ‌ల్ని అభినందించ‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది…