‘ఆచార్య’ వెనక్కి… ‘వకీల్‌ సాబ్‌’ ముందుకి !

చిరంజీవి చిత్రం ‘ఆచార్య’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కరోనా వ్యాప్తి తీవ్రత వల్ల సినిమా షూటింగ్‌లు ప్రారంభం కాలేదు. దానివల్ల సెప్టెంబర్‌లో, నవంబర్‌లోనో విడుదలవుతాయనుకున్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. చిరంజీవి చిత్రం ‘ఆచార్య’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది… జులై నుంచైనా షూటింగ్‌ ప్రారంభం అయితే అలా జరిగేది. కానీ ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. అందువల్ల ఈ చిత్రం సంక్రాంతికి కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకూ ఈ సినిమా కేవలం 40 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇందులో కథానాయికగా చేస్తోన్న కాజల్‌ వెనక్ఇకి ప్పటివరకూ షూటింగ్‌లోనే జాయిన్‌ కాలేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నకొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2021మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పవన్‌ కళ్యాణ్‌ చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పార్టు కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పవన్‌ పాల్గొనాల్సిన మేజర్‌ పార్టు అంతా పూర్తి చేసేశారు. కనీసం అక్టోబర్‌లోనైనా షూటింగ్‌ ప్రారంభిస్తే.. డిసెంబర్‌కి మిగిలిన చిత్రీకరణ పూర్తయిపోతుంది. ఇక నెలలో పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ అన్నీ పూర్తి చేసుకొని సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. హిందీ చిత్రం ‘పింక్‌’కు ఇది రీమేక్‌.ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
 
రామ్‌చరణ్‌ బదులు మరో హీరో
చిరంజీవి , కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆచార్య’లో  నక్సలైట్‌ బ్యాక్‌డ్రాప్‌లో మరో యువ హీరో పాత్రకు కూడా అవకాశముంది. ఈ పాత్రకు ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఎవ్వరి పేరూ ఖరారు కాలేదు.  రామ్‌చరణ్‌తో ఈ పాత్ర చేయించాలని కొరటాల శివ అనుకున్నారు. కానీ రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ చిత్ర నిర్మాణంలో లాక్‌ అయి పోయారు. అయినా, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ లో కొంత బ్రేక్‌ తీసుకుని రామ్‌చరణ్‌ ఆచార్య సినిమా చేస్తాడని అన్నారు. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్‌ రావడంతో మూడు నెలల సమయం పోయింది. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి చేయ్యడం రామ్‌చరణ్‌కు ప్రధానమైపోయింది. రామ్‌చరణ్‌ నటించే అవకాశాలు లేకపోవడంతో మరో హీరోను చూడమని చిరంజీవి కొరటాల శివకు సలహా ఇచ్చారట.