పవన్ కళ్యాణ్ వీరాభిమాని స్ఫూర్తితో ‘సైలెన్స్ ప్లీజ్’

బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ ‘నిశ్శబ్ద-2’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సైలెన్స్ ప్లీజ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.మార్చ్ 1న, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
చిత్ర నిర్మాత-భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే టెరిఫిక్ థ్రిల్లర్ ‘సైలెన్స్ ప్లీజ్’. అన్ని పనులు పూర్తయ్యాయి. మహాశివరాత్రికి భక్తులంతా మౌనవ్రతం పాటిస్తుంటారు కాబట్టి, మా ‘సైలెన్స్ ప్లీజ్’ చిత్రాన్ని ఆ రోజు విడుదల చేస్తున్నాం. 2018లో కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటైన ఈ చిత్రం తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు!
 
అవినాష్, పెట్రోల్ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, మ్యూజిక్: సతీష్ ఆర్యన్, సమర్పణ: వల్లూరిపల్లి రమేష్, నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వం: దేవరాజ్ కుమార్!!