బలమైన పాత్రలంటే ఇష్టమంటోంది ‘ఏంజెల్’

పాయల్ రాజ్‌పుత్‌… పేరు చెబితే తెలుగు రాష్ట్రాల యూత్ ఊగిపోతుంది.…ఎందుకంటే ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంలో ఆమె చేసిన పాత్ర అలాంటిది. తెర మీద బోల్డ్‌ సన్నివేశాలను ఎంత ధైర్యంగా చేసిన ఆమె అంతే ధైర్యంగా చెబుతోంది… “మొదటి సినిమాలో ముద్దు సన్నివేశాలు చేశాను కనుక అన్నీ అలాంటివే చేయమంటే చేయననీ, నేను పక్కా ప్రొఫెషనల్ని” అంటోంది పాయల్‌ రాజ్‌పుత్‌.
‘‘ ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు బాగానే వస్తున్నాయి. పంజాబీలో కూడా సినిమాలు ఒప్పుకున్నాను. దాంతో అక్కడికీ ఇక్కడకి తిరుగుతున్నాను. హైదరాబాద్‌ నాకు బాగా నచ్చింది. భవిష్యత్తులో ఇక్కడ సెటిలయ్యే అవకాశం లేకపోలేదు. ఇక్కడ చాలా మంది స్నేహితులయ్యారు. నాకు పవర్‌ఫుల్‌ రోల్స్, ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ స్టోరీస్‌ అంటే ఇష్టం. బాలీవుడ్‌లో ‘హీరోయిన్‌’ సినిమాలో కరీనాకపూర్‌ చేసిన క్యారెక్టర్‌ లాంటివి చేయాలని ఉంది. ఒక యువతి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే పాత్ర అది. సరిగ్గా అలాంటిపాత్ర అని కాదు కానీ,బలమైన పాత్రలంటే ఇష్టం”
స్పెషల్‌ సాంగ్‌లో ‘ఏంజిల్‌’
అందంతో కుర్రకారును, నటనతో ప్రేక్షకుల మనసును దోచేసిన పంజాబీ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కు ఆ సినిమా తర్వాత చాలా ఆఫర్లు తలుపు తట్టాయి. కానీ మనసుకు నచ్చిన పాత్రలనే ఎంచుకుని చేస్తోంది ఆమె. అలా ఓ కథ నచ్చి కోలీవుడ్‌లో నటించడానికి పచ్చజెండా ఊపారామె. ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా కేఎస్‌ అదియమాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ఒక హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ ఎంపికయ్యారు.ఈ సినిమాకు ‘ఏంజిల్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
# బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్‌ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించనున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌.