మేకప్ లేకుండా రైటర్ పాత్రలో పాయల్!

లాక్‌డౌన్ కారణంగా ఇంటివద్దే ఉంటున్న పాయల్ రాజ్‌పుత్ ఓ షార్ట్ ఫిలిం చేసి అభిమానులతో పంచుకుంది. పాయల్ రాజ్‌పుత్ తెలుగులో మొదటి సినిమా ‘Rx100’తో యూత్ మనసు దోచేసింది. ఆ తర్వాత చిత్రాల్లో కూడా అందాలు పంచి ఆమె పాపులారిటీ అంతకంతకూ పెంచుకుంటూ వచ్చింది . లాక్‌డౌన్ సమయాన్ని సమర్దవంతంగా వాడుకుంటూ ఓ షార్ట్ ఫిలిం చేసి ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లాక్‌డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటున్న చాలామంది తాగుబోతు భర్తలు తమ భార్యల్ని గృహహింసకి గురిచేస్తున్న అంశాన్ని ఎత్తి చూపిస్తూ ఈ షార్ట్ ఫిలిం చేసి ప్రేక్షకుల ముందుంచింది . ‘రైటర్ స్టోరీ చెప్పడమే కాదు.. అందులో జీవిస్తుంది‘ అంటూ ఈ షార్ట్ ఫిలిం వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. 16 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలిం కేవలం 24 గంటల్లోనే షూట్ చేశామని ఆమె చెప్పింది .
తాగుడుకు బానిసైన భర్త ప్రతిరోజూ హింసిస్తుంటే తట్టుకోలేక కోపంలో ఒక రోజు అతన్ని చంపేస్తుంది…ఈ స్టోరీ లైన్ తీసుకొని ‘ఎ రైటర్’ అనే టైటిల్‌తో ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు. ఇందులో ‘ప్రియా’ అనే రైటర్ క్యారెక్టర్ పోషించిన పాయల్.. మేకప్ లేకుండా నటించడం విశేషం. పాయల్ ప్రియుడు సౌరభ్ ధింగ్రా ఈ షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించాడు.
ఫిమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా…
ఓ భారతీయ బాక్సర్ ‌పాకిస్తాన్‌ జైలులో ఖైదు కావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆ భారతీయ బాక్సర్‌ ఎలా బయటపడ్డాడు? అతనికి ఎవరు సహాయం చేశారు? ఈ అంశాల నేపథ్యంలో జయంత్‌ సి.పరాన్జి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నరేంద్ర’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ ఫీమేల్‌ ఫైటర్‌ పైలెట్‌గా నటిస్తున్నారు.
 
‘‘పాకిస్తాన్‌ జైలులో ఖైదీ అయిన భారతీయ మాజీ బాక్సర్‌గా నీలేష్‌ నటిస్తున్నారు.స్వేచ్ఛా పోరాటానికి మద్దతు ఇచ్చే మానవ హక్కుల కార్యకర్తగా బ్రెజిలియన్‌ బ్యూటీ ఇసాబెల్లా లియేటి కనిపిస్తారు. భారత ఖైదీలను రక్షించే ప్రయత్నంలో తనను తాను త్యాగం చేసుకునే ఆప్షన్‌ ఖైదీ పాత్రను డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌ ద గ్రేట్‌ ఖలి చేశారు. ఈ సినిమాలోని ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. త్వరలో ఈ చిత్రాన్ని  విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని సినిమా యూనిట్ పేర్కొంది. 
అందమైన తారల్ని సృష్టిస్తాయి!
పాయల్ రాజ్ పుత్‌కి తొలి సినిమా ‘Rx100’ తెచ్చిన బోల్డ్ ఇమేజ్ అంత సులువుగా పోలేదు. ఆ ఇమేజ్‌తోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించింది ‘ఆర్ ఎక్స్ 100’ తర్వాత ‘ఆర్‌డి ఎక్స్ లవ్’ అంటూ రెండో సినిమాలోనూ అదే ఇమేజ్‌ని కొనసాగించిన పాయల్ ఆ తర్వాత ‘వెంకీ మామ’ చిత్రంలో సీనియర్ హీరో వెంకటేష్‌తో రొమాన్స్ చేసింది. ఆ పై వచ్చిన ’డిస్కో రాజా‘లో నటిగా మెప్పించింది కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కొత్త ప్రాజెక్టులేమీ లేకపోయినా, తన వద్ద ఉన్న గ్లామర్ అస్త్రాలను ప్రయోగిస్తూ కెరీర్‌ను నడిపిస్తోంది. తాజాగా పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి ఇప్పుడు కుర్రకారును మైమరపిస్తోంది. ముఖ్యంగా ‘చీకటి రాత్రులే అందమైన తారల్ని సృష్టిస్తాయి’ అని ఆ పిక్‌కి ఇచ్చిన క్యాప్షన్ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. క్యాప్షన్ అదిరింది. అలాగే ఫ్రెష్ లుక్‌లో ఆమె అందాలతో రొమాంటిక్ ఫీల్‌నిస్తోంది.