భయాల్ని జయించడం తప్ప, మరో మార్గం లేదు !

“స్కూల్‌రోజుల్లో వేదిక ఎక్కాలంటే చాలా భయమేసేది. డ్యాన్స్‌ పర్‌ఫార్మ్‌ చేస్తున్న సమయంలో భయం వల్ల ఒక్కోసారి స్టెప్స్‌ కూడా మర్చిపోయేదాన్ని. అయితే మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సినిమాలను వృత్తిగా ఎంచుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులొచ్చాయ”ని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే.

“చదువుకునే రోజుల్లో తనది అంతర్ముఖమైన మనస్తత్వమని..కెమెరా ముందుకొచ్చిన తర్వాతే మానసిక భయాలపై విజయం సాధించానని వివరించింది. కెరీర్‌ తొలిరోజుల్లో కెమెరా ముందుకురాగానే కాస్త కంగారుగా అనిపించేది. అయితే వృత్తిలో రాణించాలంటే భయాల్ని జయించడం తప్ప, మరో మార్గం లేదనిపించింది. అదే సమయంలో సినిమాలపై ఉన్న ప్రేమ నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలుగుతున్నా’ అని చెప్పింది. ‘ఆచార్య’ చిత్రంతో తాను నీలాంబరి అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తానని.. అది అల్లరి, అమాయకత్వం కలబోసిన చక్కటి పాత్ర ని చెప్పింది పూజాహెగ్డే.

15 మిలియన్ల ఫాలోవర్స్‌ !… పూజాహెగ్డే తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహిస్తు నిత్యం ఫ్యాన్స్‌ను పలకరించే ఈ పూజాహెగ్డే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో పూజా సోషల్‌ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటోంది. తన హేర్‌ స్టైలిస్ట్‌, మేకప్‌ అర్టిస్ట్‌ కాజోల్‌, కుక్‌, అసిస్టెంట్‌, కుక్‌ అసిస్టెంట్స్‌లను కూడా తన సంతోషంలో భాగం చేస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది.

“ఇన్‌స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా క్రేజీ టీంను మీకు పరిచయం చేస్తున్నాను . వీరంతా నన్ను నవ్విస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. నేను అనారోగ్యం బారిన పడకుంటా చూసుకుంటారు. అలాగే నేను అందంగా కనిపించేలా చేస్తారు” అంటూ రాసింది.. అంతేగాక తను ఈ మైలు రాయి చేరుకోవడంలో సహాయం చేసిన ఫ్యాన్స్‌.. ఫాలోవర్స్‌కు  ఈ సందర్భంగా పూజా ధన్యవాదాలు తెలిపింది.

పూజా హెగ్డే చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదలకు సిద్ధంగా కాగా..  ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.  ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు  తమిళంలో స్టార్ హిర్ విజయ్ సరసన ‘బీస్ట్’ లో నటిస్తోంది. అలాగే  అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి టాప్ స్టార్స్ చిత్రాలూ త్వరలో ఉన్నాయి.