మరింత నేర్చుకోవడానికి ఇదో మంచి అవకాశం!

ప్రభాస్‌ సరసన ఓ సినిమా, అక్కినేని అఖిల్‌ సరసన ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో నటిస్తున్న పూజా బాలీవుడ్‌లో సల్మాన్‌కి జోడిగా ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ చిత్రంలో నటించాల్సి ఉంది. ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డేకి కరోనా వల్ల కొంచెం ఫ్రీ టైమ్‌ దొరికింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమాల షూటింగులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సల్మాన్‌తో చేయబోయే’కబీ ఈద్‌’ సినిమా షూటింగ్‌ కోసం పూజా ఆసక్తిగా  వెయిట్‌ చేస్తోందట…”సల్మాన్‌తో పని చేయడమంటే మనలోని టాలెంట్‌కు ఇంకొంచెం మెరుగులు దిద్దుకోవాలని అర్థం. ఎన్నో ఏండ్లుగా ఇండిస్టీలో ఉన్న ఆయనకు ఎంతో అనుభవం ఉంది. దీంతో కొంచెం భయపడుతున్నాను. అగ్ర నటీనటులతో నటించే సమయంలో ఇలాగే ఉంటుందేమో. అయితే నటనలో మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి మాత్రం ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నా. ఈ కథ చాలా ఫన్నీగా ఉంటుంది” అని పూజా తెలిపింది.
కొత్త వంటలతో ప్రయోగాలు చేస్తూ.. 
లాక్‌డౌన్‌ కాలంలో ఇళ్లకే పరిమితమవ్వడంతో ఇంటి పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇంటిని చక్కబెట్టడం..నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. ఇక నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ప్రస్తుతం ఇంట్లో వంటలు తయారు చేయడంపై  ఆసక్తి చూపు తున్నారు. ఇప్పటి వరకు వంటగది వైపు చూడని వారు సైతం గరిట చేతపట్టుకొని నలభీములుగా మారుతున్నారు. కొత్త కొత్త వంటలపై ప్రయోగాలు చేస్తూ.. వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా ఇటీవల జార్జియాలో ప్రభాస్‌ 20వ సినిమా ‘ఓ డియర్‌’ షూటింగ్‌ అనంతరం మార్చిలో ఇండియాకు వచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం హైదరాబాద్‌లో తన కుటుంబంతో నివాసం ఉంటోంది.
పూజా హెగ్డే తనలోని చెఫ్‌ను నిద్రలేపి వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారు. ‘‘లాక్‌ డౌన్‌ పూర్తయ్యేసరికి గిటార్‌ నేర్చుకుంటా’’ అని గిటార్‌ నేర్చుకుంటున్న ఫొటోను ఇటీవల పూజా హెగ్డే షేర్‌ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవల హల్వా చేసిన పూజ ఇప్పుడు తన తల్లి లత కోసం పిజ్జా చేసింది. ‘‘మా చిన్నతనంలో అమ్మ మా కోసం పిజ్జా చేసి పెట్టేది.ఇప్పుడు అమ్మ కోసం నేను పిజ్జా  చేస్తున్నందుకు  చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పింది పూజా.
పూజా హెగ్డే తండ్రి మంజునాథ్‌ ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పూజా కుటుంబం క్వారంటైన్‌లోనే ఉండటం వల్ల ఇంట్లోనే తండ్రి కోసం ఏదైనా స్పెషల్‌గా తయారుచేసి సర్‌ప్రైజ్‌ ఇద్దాం అనుకుంది. దీంతో తండ్రి కోసం పూజా ‘మాస్టర్‌ చెఫ్‌’గా మారి చాక్లెట్‌ కేక్‌ తయారు చేసింది. ఈ కేక్‌కు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అలాగే తండ్రి కేక్‌ కట్‌ చేస్తున్న ఫోటోలు కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఇక లాక్‌డౌన్‌ కాలంలో పూజా వంటలు నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే గజార్‌ కా హల్వా, పిజ్జాను ఆమె తయారు చేసిన విషయం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్‌ ‘ఓ డియర్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌), అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది పూజ. అలాగే ‘కబీ ఈద్‌ కబీ దీవాలీ’ అనే హిందీ సినిమాలో సల్మాన్‌ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. వీటితో పాటు తమిళంలో రెండు సినిమాల కథలను వినాల్సి ఉందని ఇటీవల సోషల్‌ మీడియాలో తెలిపింది పూజ.