దానివల్ల చిత్ర పరిశ్రమలో చాలా మార్పువచ్చింది!

‘మీటూ’ అనేది గొప్ప ఉద్యమం. ఒక నటిగా, మహిళగా ‘మీటూ’ ఉద్యమాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదు. దాని వల్ల ఇండిస్టీలో చాలా మార్పు వచ్చింది’ అని అంటోంది పూజా హెగ్డే. ఓ ఇంటర్వూలో ‘మీటూ’ ఉద్యమంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై తన అభిప్రాయాలను పూజా చెప్పింది….
”మీటూ’ అనేది గొప్ప ఉద్యమం. ఒకరు బయటకు వచ్చి తమ చేదు అనుభవాలు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఇలాంటి ఉద్యమం చాలా అవసరం. దీన్ని నేను తేలికగా తీసుకోవడం లేదు. ఇది మున్ముందు కూడా కొనసాగాలి. ఎందుకంటే ‘మీటూ’ ఉద్యమం వల్ల ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో చాలా మార్పు వచ్చింది. ‘మీటూ’ వల్ల మొదటగా ప్రభావితమైన సినిమా ‘హౌస్‌ఫుల్‌ 4’. దీంతో దర్శకుడిని మార్చాల్సి వచ్చింది. అది చాలా కష్టమైన స్థితి. ఫర్హాద్‌ దర్శకత్వ బాధ్యతలు తీసుకుని చాలా బాగా డీల్‌ చేశారు”. పూజా నటించిన ఈ ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రం శుక్రవారం విడుదలయ్యింది.
 
‘హౌస్ ఫుల్ 4’ తో మరోసారి నిరాశ
పూజాహెగ్గే హిందీ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘మొహంజోదారో’ చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో పూజా తెలుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. సుదీర్ఘ విరామం తర్వాత పూజాహెగ్డే నటించిన ‘హౌస్‌పుల్‌ 4’ చిత్రం అక్టోబర్‌ 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో మంచి సక్సెస్‌ వస్తుందనుకున్న పూజాహెగ్డేకు మరోసారి నిరాశ ఎదురైంది. హౌస్ ఫుల్ -4 చిత్రం మిక్స్ డ్ టాక్ తో ప్రదర్శించబడుతోంది.దీంతో ఇక ప్రస్తుతం తెలుగులో స్టార్‌హీరోలతో చేస్తున్న సినిమాలతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోదట.
షూటింగ్‌లకు కాస్త విరామం
పూజా హెగ్డే తీరిక లేకుండా నటిస్తోంది. రోజులో కనీసం నాలుగు గంటలు కూడా నిద్రపోవడానికి సమయం ఉండడం లేదట. తెలుగులో ఇప్పుడు ఈమె రెండు చిత్రాల షూటింగ్‌ల్లో పాల్గొంటోంది. అందులో ఒకటి అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘అల వైకుంఠపురములో..’, అఖిల్‌ హీరోగా రూపొందుతోన్న మరో రొమాంటిక్‌ చిత్రం చిత్రీకరణలో పాల్గొంటోంది. దీనికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కాకుండా ప్రభాస్‌ చేస్తున్న పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రంలో కూడా కథానాయికగా చేయనుంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్‌ నుంచి చిత్రీకరణ మొదలు కానుంది. ప్రస్తుతం చేస్తోన్న రెండు సినిమాల షూటింగ్‌లకు విరామం ఇచ్చింది. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో కలసి నటించిన ‘హౌస్‌ఫుల్‌4’ ప్రమోషన్‌ పనులు ఉండడంతో ఈ సినిమా చిత్రీకరణకు కాస్త విరామం ఇచ్చింది. మరి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని దీపావళి, నాగులచవితి అయిపోయాక మళ్లీ ఈ సినిమాల చిత్రీకరణలో పూజా పాల్గొననుంది.