ఉత్తరాది బాధించింది.. దక్షిణాది ధైర్యాన్నిచ్చింది !

పూజా హెగ్డే అగ్రహీరోలందరి సరసనా నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. అయితే టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్‌పైనే పూజ దృష్టి సారించింది. హృతిక్ రోషన్ `మొహంజదారో` సినిమాతో బాలీవుడ్ లో  అడుగు పెట్టింది. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలవడంతో అక్కడ పూజ కెరీర్ ముందుకు సాగలేదు. అటుపై దక్షిణాది పై దృష్టి పెట్టి.. ప్రేక్ష‌కుల్ని మెప్పించగలిగింది. ఆ తర్వాత`హౌస్‌ఫుల్-4`తో బాలీవుడ్‌లోనూ స‌క్సెస్ అందుకుంది. ఇటీవల హిందీలో తొలిచిత్రం అనుభవాలను గుర్తు చేసుకుంది… “తొలి సినిమా`మొహంజదారో`పరాజయం పాలవడం నన్ను తీవ్రంగా బాధించింది. ఎవ‌రికైనా మొద‌టి సినిమా ఎంతో కీల‌క‌మైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి సినిమా ఫెయిల్ కావ‌డంతో గుండె ప‌గిలినంత ప‌నైంది. అయితే ద‌క్షిణాదిన విజయం సాధించడంతో ధైర్యంగా ముందుకు వెళ్లాను. మొద‌టి సినిమా విఫ‌లం కావ‌డం వ‌ల్లే.. బాలీవుడ్‌లో రెండో సినిమాకు సంత‌కం చేసేందుకు గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు `హౌస్‌ఫుల్-4` ఘన విజయం సాధించ‌డంతో బాలీవుడ్‌పై కూడా దృష్టి సారించాను” పూజా హెగ్డే చెప్పింది.

‘స‌ర్క‌స్’ లో ర‌ణ‌వీర్ సింగ్‌తో… పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలు ఉన్నాయి. ప్ర‌భాస్‌తో క‌లిసి ఫిక్ష‌న‌ల్ రొమాంటిక్ ‘రాధేశ్యామ్’ చేస్తుండ‌గా.. అఖిల్‌తో క‌లిసి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్’ సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్‌లోనూ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి ‘స‌ర్క‌స్’ అనే కామెడీ చిత్రంలో నటిస్తోంది. ఇది ‘అంగూర్‌’ (1982) చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. దీనికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ‘స‌ర్క‌స్’ చిత్రంలో భాగ‌స్వామ్యం అవుతున్నందుకు పూజా హెగ్డే  తెగ ఆనంద పడుతోంది…

“నేను రోహిత్ శెట్టి స‌ర్‌కు వీరాభిమానిని. ఆయ‌న త‌న సినిమాల ద్వారా ప్ర‌పంచానికి వినోదాన్ని అందిస్తున్నారు. ‘సింగ‌మ్’‌, ‘సింబా’.. మ‌రేదైనా కానీ, ఆయ‌న సినిమాలు చూస్తున్నంత‌సేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అలాంటిది రోహిత్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నానంటే సంతోషం ప‌ట్ట‌లేకున్నాను. షూటింగ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అని ఎదురు చూస్తున్నాను” అని పూజా చెప్పింది.. ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్‌ కామెడీ ఉంటుందన్నారు. ర‌ణ్‌వీర్ కూడా డ‌బుల్ యాక్ష‌న్ చేస్తున్నార‌ట‌. కాగా పూజా బాలీవుడ్‌లో మ‌రో చిత్రంలో కూడా మెర‌వ‌నున్నాను. “క‌బీ ఈద్ క‌బీ దివాళి”లో స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌తో జోడీ క‌ట్ట‌నుంది.

మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ తో పూజాహెగ్డే… అఖిల్‌ అక్కినేని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్’ లో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తున్నారు. ‘మీ మ్యారీడ్‌ లైఫ్‌ నుంచి ఏం ఆశిసున్నారని హీరో అఖిల్‌ అడగ్గా.. కేరింగ్‌ భర్త, అన్ని పనులు షేర్‌ చేసుకోవాలని, నాకు ఉమ్మడి కుటుంబం అంటే చిరాకు. లవ్‌..లవ్‌..లవ్‌.. ఇంకేముంటుంది మ్యారీడ్‌ లైఫ్‌’ అని పూజా చెప్పే డైలాగ్‌తో ఈ చిత్రం టీజర్‌ మొదలవుతుంది. “కొంచం వైల్డ్‌గా ఆలోచించు డార్లింగ్”‌ అని అఖిల్‌ అనగానే.. “నాకు  కాబోయేవాడు నా షూ‌తో సమానం”  అని అంటుంది పూజా ‌. సరికొత్త డైలాగ్‌లతో ఉన్న టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ  నిర్మిస్తున్న ఈ చిత్రం  2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.