అనుభవం, అవకాశం… రెండూ గొప్పవే!

‘‘చిత్రసీమలో అనుభవం, అవకాశం… రెండూ గొప్పవే. వచ్చిన అవకాశాలే మనల్ని రాటు తేలేలా చేస్తుంటాయి’’ అంటోంది పూజా హెగ్డే. 
‘‘ మన ప్రతిభ తేలాలంటే ముందు అవకాశాలు రావాలి. మనలో ఎంత గొప్ప నటి అయినా ఉండొచ్చు. అది బయటకు రాకపోతే… నాలో ఓ నటి ఉన్న సంగతి ఎవరికి తెలుస్తుంది? ఏ సినిమా బాగా ఆడుతుందో…ఆడదో చెప్పడం చాలా కష్టం. అందుకే నేను.. “ఆ సినిమా వల్ల నేనేం నేర్చుకుంటాను? సినిమా చేస్తున్నప్పుడు…ఆ పాత్రతో ప్రయాణం చేస్తుంటే నేనెంత ఆనందంగా ఉన్నాను?” అనేదే ఆలోచిస్తా ! ఇక సినిమా ‘విజయం’ ఎప్పుడూ బోనస్‌గానే భావించాలి. అటు విజయం దక్కక, ఇటు ఆ సినిమా చేసినందుకు సంతృప్తి లేకుంటే.. చేయడంలో అర్థం ఉండదు’’ అంది.
నేను ఎప్పుడు మారుతానా? అని..
‘‘నాతో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా …నేను చేసే పనులన్నీ మెచ్చుకుంటారు. కానీ ఆ విషయంలో మాత్రం నన్ను చూసి భయపడతారు. నేను ఎప్పుడు మారుతానా? అని చూస్తుంటారు’’ అని అంది పూజా హెగ్డే. తెలుగులో వరుణ్‌ తేజ్‌ సరసన ‘వాల్మీకి’లోనూ, ప్రభాస్‌ సరసన లవ్‌స్టోరీలోనూ, అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’నూ నటిస్తోంది పూజా హెగ్డే.
 
‘‘నాకు మేకప్‌ వేసుకోవడం …. ఆ సామాగ్రిని కొనడం కూడా చాలా ఇష్టం. ఎక్కడ ఏ మేకప్‌ కిట్‌ కొత్తగా కనిపించినా వెంటనే కొనేస్తా. మా ఇంటి నిండా అవే కనిపిస్తుంటాయి. ‘అసలు నేను మేకప్‌ సామాన్ల కోసం ఎందుకింత ఖర్చుపెడుతున్నానని’ నాతో షాపింగ్‌కి వచ్చేవాళ్లు ఆశ్చర్యపోతుంటారు. నా తీరు చూసి వాళ్లు భయపడినా …నాకేమీ పట్టనట్టు ఉంటాను’’ అని చెప్పింది