మనసుకు సంతోషాన్నిచ్చేదే అన్నిటికంటే ముఖ్యం!

తనను సంతోషపెట్టేది ఏదో చెప్పడంతో పాటు.. ప్రేక్షకులకు వాళ్లను సంతోషపెట్టేది ఏదో అన్వేషించమని పూజా హెగ్డే సలహా ఇస్తోంది. “మానసిక సంతృప్తి, సంతోషమే అన్నిటికంటే ముఖ్యమైనది’’ అని పూజా హెగ్డే చెప్పింది. మానసిక ఒత్తిడి తో ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె పోస్ట్‌ పలువురి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ముంబయ్‌లో సొంతింట్లో సొంత మనుషుల మధ్య సరదాగా సమయం గడుపుతున్నపూజా.. కుటుంబ సభ్యులకు మష్రూమ్‌ రైస్‌, క్రీమీ టస్కన్‌ చికెన్‌ కర్రీ స్వయంగా వండటంతో పాటు వడ్డించింది. పూజా హెగ్డే మాట్లాడుతూ.. ‘‘మీకు సంతోషాన్నిచ్చేది ఏదో వెతకండి. మానసిక సంతృప్తే అన్నిటికంటే ముఖ్యమైనది. లాక్‌డౌన్‌లో మా కుటుంబానికి వంట చేయడం నాకు ఆనందాన్నిచ్చింది.. ఇస్తోంది. ఫుడ్‌ అంటే నేను హ్యాపీగా ఫీలవుతా. నా ముఖం మీద చిరునవ్వును తీసుకొచ్చేది ఆహారమే. నాకు సంతోషా న్నిచ్చేది ఏదో ఎప్పటి కప్పుడు మీతో పంచు కుంటున్నా ’’ అని చెప్పింది .
 
స్వీయనిర్బంధంలోకి వారందరినీ..
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న పూజా హెగ్డే బాలీవుడ్‌లో కూడా స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నకు పూజ మరింత ఆసక్తి కరంగా సమాధానమిచ్చింది…
“లాక్‌డౌన్ నేపథ్యంలో మీతో కలిసి నటించిన హీరోలలో ఎవరితో స్వీయనిర్బంధంలో ఉండాలనుకుంటారు? వారి నుంచి ఏమి నేర్చుకుంటారు?` అనే ప్రశ్న పూజకు ఎదురైంది. దీనికి పూజ స్పందిస్తూ.. ” మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పనిచేశా. అవకాశమొస్తే వారందరినీ స్వీయనిర్బంధంలోకి తీసుకుని.. వారి నుంచి అనేక విషయాలు తెలుసుకుంటా. అలా కాకుండా ఒక్కరితోనే అయితే.. నేను హృతిక్ రోషన్‌నే ఎంచుకుంటా. చిన్నప్పటి నుంచి అతను నా కలల హీరో. బాలీవుడ్‌లో నా తొలి సినిమా హృతిక్‌తోనే. ఆయన అనేక విషయాల్లో నాకు స్ఫూర్తి. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటాన”ని పూజ చెప్పింది.
 
బికినీతో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తా!
“లాక్‌డౌన్‌ బ్రేక్‌ని ఎంజాయ్‌ చేస్తున్నా. మేకప్‌ గట్రా అవసరం లేదు. పైజమాస్‌ వేసుకుంటున్నా. అయితే… బీచ్‌లో సరదాగా షికారుకు వెళ్లాలనుంది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక..కేరళలోని బెకల్‌ బీచ్‌కి వెళతా. బికినీ వేసుకుని ప్రై వేటుగా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తా’’ అని పూజా హెగ్డే అంది..
“మా గ్రాండ్‌మదర్‌ని చూసి చాలా రోజులైంది. ఇప్పుడామె మాతో ఉండడం లేదు. లాక్‌డౌన్‌ తొలగించాక తన దగ్గరకు వెళతా. అలాగే, జిమ్‌కి వెళతా. అఫ్‌కోర్స్‌… నా స్నేహితులు అందరినీ వ్యక్తిగతంగా కలవాలని ఉంది. ముంబయ్‌లో గోవా-పోర్చుగీస్‌ ఫుడ్‌ సర్వ్‌ చేసే రెస్టారెంట్‌ ‘ఓ పెడ్రో’ ఉంది. అందులో సీ ఫుడ్‌ చాలా బావుంటుంది. లాక్‌డౌన్‌ తర్వాత ఆ రెస్టారెంట్ కి వెళ్లి నచ్చినవి తింటా” అని చెప్పింది.