అందుకే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా !

పూజా హెగ్డే… “”ఏదైతే నేర్చుకుంటానో, దాన్ని ఆచరించేందుకు, ప్రదర్శించేందుకు ఏమాత్రం అశ్రద్ధ చేయను’ అని అంటోంది పూజా హెగ్డే. తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్‌ అగ్ర కథానాయికల జాబితాలో చోటు సొంతం చేసుకున్న పూజా ఇటీవల వరుసగా అల్లు అర్జున్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌లతో కలిసి నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు మహేష్‌బాబు, ప్రభాస్‌లకు జోడీగానూ నటిస్తోంది.
మరోవైపు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించే అవకాశాలను అంది పుచ్చుకుంటోంది.
అందులో భాగంగా ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్‌ 4’లో నటిస్తోంది.

‘హౌస్‌ఫుల్‌ 4’ లోని పాత్ర కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకుంటోందట. ‘ఇందులో నా పాత్ర కోసం వారం రోజులుగా మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ తరగతులకు వెళ్తున్నాను. ఇది ఫిజికల్‌గా చాలా ఛాలెంజింగ్‌తో కూడిన గేమ్‌. అయినా ఫన్‌ ఉంటుంది. ట్రైనింగ్‌ ప్రాసెస్‌ను బాగా ఎంజాయ్  చేస్తున్నాను. అంతేకాదు నేర్చుకున్న ప్రతి అంశాన్ని పాత్ర కోసం ప్రదర్శించేందుకు ఆతృతతో వెయిట్‌ చేస్తున్నాను. నా శక్తి మేరకు బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇస్తాననే నమ్మకం ఉంది ‘అని తెలిపింది.

అక్షయ్ కుమార్‌, రితేష్‌ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌, కృతి సనన్‌, కృతి కర్బందా వంటి హేమాహేమీలతో పూజా నటిస్తున్న ఈ కామెడీ చిత్రానికి ఫర్హాద్‌ సాంజీ దర్శకుడు. పూజా తెలుగులో మహేష్‌ సరసన ‘మహర్షి’లో, ప్రభాస్‌ సరసన రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తుంది.