ఆ బోల్డ్ సీన్స్ కి బోల్డ్ బ్యూటీ నే భయపడింది !

‘ముకుంద’ తో టాలీవుడ్‎లో హీరోయిన్‎గా అడుగుపెట్టింది బోల్డ్ బ్యూటీ పూజా హెగ్డే. ఈ సినిమా సరైన ఫలితం రాబట్టలేనప్పటికీ అమ్మడికి స్టార్ హీరోల పక్కన బాగానే అవకాశాలొచ్చాయి. టాలీవుడ్‎లో టాప్ హీరోయిన్ అనిపించుకోడానికి నానా తంటాలు పడుతోంది పూజా. ఇపుడిపుడే విజయాల వైపు పయనిస్తున్న అమ్మడు ఓ బాలీవుడ్ మూవీ ఛాన్స్ కూడా వదులు కుందట.తెలుగు, తమిళ చిత్రాల్లో అమ్మడు మరికొన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్న టైమ్‌లోనే బాలీవుడ్ నుంచి పెద్ద అవకాశం పూజాని వెతుక్కుంటూ వచ్చింది….
 జాన్ అబ్రహం, మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రల్లో ‘రా’ అనే సినిమా రూపొందుతోంది. మిలాప్ ఝవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న యాక్షన్ మూవీ. అయితే ఈ సినిమాకిప్పుడు కథానాయిక ఎంపికే పెద్ద తలనొప్పిగా తయారయిందట.ఈ సినిమా కోసం ముందుగా మిల్కీ బ్యూటీ తమన్నా సీన్‌లోకొచ్చింది. అమ్మడి మీద కొంత భాగం కూడా చిత్రీకరించారట. అయితే ఏంజరిగిందో తెలియదు కానీ ఈ సినిమా నుంచి తమన్నా పక్కకు తప్పుకుందట.
ఇలాంటి పరిస్థితుల్లో దర్శక, నిర్మాతలు ‘మొహంజదారో’ తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన పూజా హెగ్డేని సంప్రదించారట. అయినా తనను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని పూజా వదులుకోవడం అందరినీ ఆశ్చయపరిచింది. ఈ సినిమాలో బోలెడన్ని బోల్డ్ సీన్స్ ఉండడమే అందుకు కారణమంటున్నారు. ఇంతకు ముందు ‘రాకీ హ్యాండ్సమ్’ లో శృతిహాసన్, జాన్ అబ్రహంపై అలాంటి బోల్డ్ సీన్స్ చిత్రీకరించారు. ఆ భయంతోనే పూజ అవకాశం వదలుకుందట. ఆ బోల్డ్ సీన్స్ కి బోల్డ్ బ్యూటీ నే భయపెట్టాయి !