అందీ అందని బాలీవుడ్ కన్నా.. టాలీవుడ్ ఎంతో మిన్న!

పూజా హెగ్డే కథానాయికగా రాణించాలని బాలీవుడ్‌లో విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే అక్కడ సరైన గుర్తింపు, అవకాశాలూ రాలేదు. దీంతో సౌత్‌పై ఫోకస్‌ చేసిన పూజా హెగ్డేకి తెలుగులో భారీ విజయాలు అందాయి. మంచి క్రేజ్‌ సొంతం చేసుకుని అగ్ర హీరొయిన్ గా రాణిస్తోంది. తెలుగునాట ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. వీటిని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి పూజా ఏకంగా తన మకాంని హైదరాబాద్‌కి ఫిష్ట్‌ చేసింది. హైదరాబాద్‌లో కొన్న ఓ లగ్జరీ ఫ్లాట్‌లోకి త్వరలోనే రానుంది. పూజా ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌’ పాన్‌ ఇండియా సినిమాలోను, అఖిల్‌కి జోడిగా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లోనూ నటిస్తోంది. అలాగే సల్మాన్‌ సరసన ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ చిత్రంలో నటించే ఆఫర్‌నీ పూజా దక్కించుకుంది.
 
మానసికంగా సిద్ధంగా ఉన్నా!
షూటింగ్స్ ఆపేసి 150 రోజులు దాటిపోయింది.. ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు. అక్కడక్కడా చిన్న సినిమాలు మొదలైనా కూడా పెద్ద వాళ్లు మాత్రం ఇంకా అడుగు బయటికి పెట్టడం లేదు.ఎప్పుడు ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.. కరోనా ఎక్కడ్నుంచి దాడి చేస్తుందో తెలియక.. అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. బతికుంటే బలిసాకు తిందాంలే అన్నట్లు ఇంటి నుంచి బయటికి రావడం లేదు. డిసెంబర్ తర్వాతే షూటింగ్స్ అంటున్నారు. స్టార్ హీరోల అయితే కరోనా పోయేంత వరకు కూడా మేం బయటికి రామంతే అంటూ బిగుసుకు కూర్చున్నారు. దాంతో పెద్ద సినిమాల షూటింగ్స్ అన్నీ అలాగే ఆగిపోయాయి.అక్కడక్కడా ఒకరిద్దరు బయటికి వస్తున్నా కూడా.. కరోనా అటాక్ చేస్తుండటంతో ..షూటింగ్ అనేది మరిచిపోతున్నారు సినిమా వాళ్లు. ఈ క్రమంలోనే పూజా హెగ్డే ముందుకొచ్చింది. తాను షూటింగ్స్ చేసుకోడానికి రెడీ.. మీరు రెడీయా అని సవాల్ చేస్తోంది.. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు క్రేజీ సినిమాలున్నాయి. ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాధే శ్యామ్’‌తో పాటు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కూడా ఉంది.
ఈ రెండు సినిమాల్లో ఏది సెట్స్‌పైకి వచ్చినా.. తాను కాల్షీట్ ఇవ్వడానికి,షూటింగ్‌కు రావడానికి సిద్ధమే అని అంటోంది పూజా. ప్రస్తుతం పూజా హెగ్డే బెంగళూరులో తన తల్లిదండ్రులతో కలిసి ఉంది. లాక్ డౌన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె బయటకు రావట్లేదు.పూర్తిగా ఇంటికే పరిమితమైంది. దాంతో ఇప్పుడు షూటింగ్స్ చేయడానికి తను మానసికంగా.. శారీరకంగా కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. మరి పూజా సిద్ధంగానే ఉన్నా.. మన దర్శక నిర్మాతలు, హీరోలదే ఆలస్యం..
 
పండుగలన్నీ సాదాసీదాగానే…
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వినాయకచవితి వంటి పండుగలను ఘనంగా జరుపుకోలేకపోయానని అందాల భామ పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేసింది.. ‘ముగమూడి’ చిత్రం ద్వారా పూజా హెగ్డే తమిళ చిత్రసీమకు పరిచయమయ్యింది.. ఆ తర్వాత వరుసగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి బిజీగా మారింది.. ఈ నేపథ్యంలో గత ఐదు నెలలుగా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా పడిన కష్టాలను వివరిస్తూ ట్విట్టర్‌లో ఓ సందేశం పోస్టు చేసింది.. సినీనటిగా షూటింగ్‌లో బిజీగా ఉండే తాను.. ఐదు నెలలుగా ఇంటి వద్దనే ఒంటరిగా గడపడం బోర్‌ కొట్టిందని తెలిపారు. అంతే కాకుండా వినాయకచవితి వంటి పండుగలను కూడా ఘనంగా కుటుంబీకుల మధ్య జరుపుకోలేకపోయానని పేర్కొన్నారు. దేశం నుంచి కరోనా మహమ్మారి వెళ్లేలోగా పండుగలన్నీ సాదాసీదాగానే జరుపుకోవాలేమోనని పూజా హెగ్డే ఆందోళన వ్యక్తం చేసింది.