స్టార్ హీరోల‌తో ఒకే రోజు మూడు షిఫ్ట్‌లు

పూజా హెగ్డే `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` తో గ్లామ‌ర‌స్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా త‌ర్వాత ప‌లువురు స్టార్ హీరోల‌తో నటించే అవ‌కాశం పూజ‌కు ద‌క్కింది. ఎన్టీయార్‌తో ఇప్ప‌టికే `అర‌వింద స‌మేత‌` సినిమా చేసిన పూజ.. మ‌హేష్‌తో `మ‌హ‌ర్షి` చేసింది. అలాగే రాధాకృష్ణ డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాలోనూ న‌టిస్తోంది.
ఈ మూడు సినిమాల షూటింగ్‌లో ఒకే స‌మ‌యంలో జ‌రిగాయి. దీంతో ఒకేరోజు ఈ మూడు సినిమాల షూటింగ్‌ల్లోనూ పాల్గొనేద‌ట‌. ఆ అనుభ‌వాన్ని తాజాగా పూజ వివ‌రించింది…. `గ‌తేడాది ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ఒక్కో రోజు మూడు షిఫ్ట్‌ల్లోనూ ప‌నిచేసేదాన్ని. ఉద‌యం ఎన్టీయార్ సినిమా షూటింగ్‌లోనూ, మ‌ధ్యాహ్నం మ‌హేష్ సినిమా షూటింగ్‌లోనూ, రాత్రికి ప్ర‌భాస్ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనేదాన్ని. ఆ త‌ర్వాత మూడు గంట‌లు మాత్ర‌మే ప‌డుకునేదాన్ని. అది నా కెరీర్‌లోనే బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్‌. ఎక్కువ సేపు ప‌డుకుంటేనే అందంగా ఉంటామ‌ని అంటుంటారు. కానీ, నేను త‌క్కువ స‌మ‌యం ప‌డుకుంటేనే అందంగా ఉంటాన‌`ని పూజ చెప్పింది.
 
రెండు కోట్లు డిమాండ్
టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం పూజా హెగ్డే హవా న‌డుస్తోంది. ఒక ప‌క్క స్టార్ హీరోల‌తోనే కాదు.. మ‌రోప‌క్క వీలున్న‌ప్పుడ‌ల్లా యువ క‌థానాయ‌కుల‌తో కూడా న‌టిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌తో `సాక్ష్యం`లో న‌టించిన పూజా ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌తో కూడా న‌టించ‌బోతుంది. వివ‌రాల్లోకెళ్తే.. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ `వాల్మీకి` చిత్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఈ చిత్రంలో ముందుగా డ‌బ్బింగ్ స్మాష్ బ్యూటీ మృణాళిని ర‌విని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ పూజా హెగ్డే అయితే సినిమాకు క్రేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని భావించాడ‌ట‌. దాంతో నిర్మాత‌లు పూజా హెగ్డేను సంప్ర‌దించార‌ట. పూజా ఏకంగా రెండు కోట్ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేసింద‌ట‌. పూజా రెమ్యున‌రేష‌న్ విని నిర్మాత‌లు షాక్ అయ్యార‌ట‌. ద‌ర్శ‌కుడి రెఫ‌రెన్స్ కావ‌డంతో నిర్మాత‌లు ఆమె కోరినంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి ఓకే చెప్పార‌ని టాక్‌. నిజానికి వ‌రుణ్‌తేజ్ తొలి చిత్రం`ముకుంద‌`లో పూజా హెగ్డే హీరోయిన్‌. వ‌రుణ్‌తో పూజా హెగ్డే క‌లిసి న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది.త‌మిళంలో విజ‌య‌వంత‌మైన `జిగ‌ర్‌తండా` చిత్రానికి రీమేకే `వాల్మీకి`. త‌మిళంలో బాబీ సింహా చేసిన పాత్ర‌ను తెలుగులో వ‌రుణ్ తేజ్ చేస్తుండ‌గా.. సిద్ధార్థ్ పాత్ర‌ను త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి చేస్తున్నాడు.