సెలెనా స్నేహం కోసం ఫ్రాన్సియా కిడ్నీ త్యాగం !

 తన ప్రాణ స్నేహితురాలి కోసం ఏకంగా కిడ్నీ దానం చేసి ఒక్కసారిగా అందరి చూపూ తన వైపు తిప్పుకుందో నటి. ఆ పాప్ సింగర్ ఇన్‌స్టా గ్రాంలో ఆపరేషన్ సమయంలో వారిద్దరూ బెడ్‌పై ఉన్న పిక్‌ను పోస్ట్ చేసేంత వరకూ ఈ విషయం బయటకు తెలియలేదు.ఓ పాప్ సింగర్‌కూ.. ఓ ప్రముఖ నటికి మధ్య స్నేహం అంటే ఎంతవరకూ..? మహా అయితే కలిసి రెస్టారెంట్‌కి వెళ్లి భోజనం చేసే వరకు.. అంతే కదా..
ప్రముఖ పాప్ సింగర్, నటి సెలెనా గోమెజ్‌కు లూపస్ అనే వ్యాధి సోకింది. దాని కారణంగా ఆమె శరీరంలో కీలక అవయవాలు పాడై పోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరించారు. వెంటనే కిడ్నీ ఆపరేషన్ చేస్తే ప్రమాదం నుంచి సేవ్ అవ్వొచ్చిన డాక్టర్లు సూచించారు. ఇది విన్న సెలెనా ప్రాణ స్నేహితురాలు.. ప్రముఖ నటి ఫ్రాన్సియా రైసా కిడ్నీ దానం చేసింది. ఆపరేషన్ సక్సెస్ అయింది.
 “కొంతకాలంగా నేను సైలెంట్‌గా ఉండటంపై నా అభిమానుల్లో చాలా అనుమానాలున్నాయి. నా కొత్త ఆల్బమ్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ.. లూపస్ వ్యాధి వచ్చింది. శస్త్ర చికిత్స అయ్యాక కోలుకునేందుకు కొంత సమయం పట్టింది. నా కుటుంబ సభ్యులు, డాక్టర్స్‌కు థాంక్స్. ముఖ్యంగా ఫ్రాన్సియా నాకు అరుదైన బహుమతిగా కిడ్నీని ఇచ్చింది. ఆమె చేసిన త్యాగానికి ఎప్పటికీ రుణపడి ఉంటా” అంటూ సెలెనా ఫోటోతో పాటు ఓ మెసేజ్‌ని కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు.. లూపస్‌ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన లింకును కూడా ఆమె పోస్ట్‌ చేసింది.