బడ్జెట్ లో నలభై కోట్లకు పైగా వీరిద్దరికే !

150 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బేనర్ పై తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్, ముంబై, అబుదాబి, బుచారెస్ట్ ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్ర హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ని సెలక్ట్ చేసినట్టు మేకర్స్ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించారు. ఇక ఈ చిత్రం కోసం దాదాపు 12 కోట్ల రెమ్యునరేషన్ ని ఈ అమ్మడికి ముట్టజెప్పనున్నట్టు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం ఏకకాలంలో రూపొందనుండ‌గా, ఒక్కో భాష‌కి శ్ర‌ద్ధా 4 కోట్లు చార్జ్ చేస్తుంద‌ని బీటౌన్ టాక్.

ఇక ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ నెలలోనే మూవీ టీంతో కలవనున్న ప్రభాస్ ఈ చిత్రానికి గతంలో ఎన్నడు తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ‘బాహుబ‌లి’ సినిమాతో ప్ర‌భాస్ కి దేశ వ్యాప్త గుర్తింపు  ల‌భించింది. దీంతో యంగ్ రెబ‌ల్ స్టార్ కి నిర్మాత‌లు 30 కోట్లు ఇచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది. యూవి క్రియేషన్స్‌ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రతి నాయకుడిగా ‘కత్తి’ ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్ నటిస్తున్నారు. మరో విలన్‌ పాత్రలో చంకీ పాండేను ఎంపికచేసినట్లు చిత్రవర్గాల సమాచారం. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ‘సాహో’ చిత్రం కోసం త‌న గెటప్ మార్చుకునే ప‌నిలో ఉన్నట్టు తెలుస్తోంది