ప్ర‌భాస్ శ్రీరాముడుగా ఓంరావుత్ దర్శకత్వంలో ‘అదిపురుష్’

‘పాన్ ఇండియా’ స్టార్‌గా మారిన టాలీవుడ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో సినిమాలు చేయ‌డానికి బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంతో ఆస‌క్తిని చూపుతున్నారు. తాజాగా ఈ లిస్టులో ద‌ర్శ‌కుడు ఓంరావుత్ చేర‌బోతున్న‌ట్లు చాలా రోజులుగా వార్త‌లు వస్తూనే ఉన్నాయి. కానీ ప్ర‌భాస్ బాలీవుడ్ ప్రాజెక్ట్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. ఇది సోమ‌వారం రాత్రే క‌న్‌ఫ‌ర్మ్ అయ్యింది. ఈరోజు ఉద‌యం 7 గంట‌ల 11 నిమిషాల‌కు అనౌన్స్ చేస్తామ‌ని ప్ర‌భాస్‌, ఓం రావుత్ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించారు. డికేడ్ బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అని ప్ర‌క‌టించారు. దీంతో ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారోన‌ని ఆస‌క్తిరేగింది… ప్ర‌భాస్ 22 వ చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్ర‌భాస్ హీరోగా ఓంరావుత్ దర్శకత్వంలో ‘అదిపురుష్’ అనే టైటిల్‌తో సినిమా తెర‌కెక్క‌నుంది. ‘చెడుపై మంచి సాధించే విజయాన్ని సెల‌బ్రేట్ చేసుకుందాం’ అని హీరో ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్‌ ఓంరావుత్ అధికారికంగా ప్ర‌క‌టించారు. టీసిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. రూ.350కోట్ల బ‌డ్జెట్‌తో సినిమా నిర్మితం కానుంది. ప్యాన్ ఇండియా మూవీగా సినిమాను హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో నిర్మించ‌నున్నారు.

Rebel Star #Prabhas’s Magnum Opus 3D Film,  #Adipurush… Celebrating the victory of good over evil! #Prabhas22
@ItsBhushanKumar @omraut @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries
Starts in 2021… Release In 2022