ఈ క్రేజీ కాంబినేషన్ త్వరలోనే చూస్తామట !

ఒక క్రేజీ కాంబినేషన్ త్వరలోనే ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ నయా జోడీ ఎవరో తెలిస్తే టాలీవుడే కాదు బాలీవుడ్‌ సైతం షాక్‌ అవ్వాల్సిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ పేరు జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ మారుమోగింది. అలాగే బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె హాలీవుడ్  వరకూ వెళ్ళిన నటి.  ఈ కాంబినేషన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ మీద మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అవుతోందట. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రభాస్‌ మూడేండ్ల క్రితం నుంచే గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఓ బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా కూడా ఊపాడు….

ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌లో రూపొందబోయే సినిమాలో కథానాయికగా దీపికా పదుకొనెను తీసుకోబోతున్నారని సమాచారం. ప్రభాస్‌ సరసన దీపికా నటిస్తే ఆ జోడీ హాలీవుడ్‌ స్టయిల్‌లో ఉంటుందని చిత్ర బృందం భావిస్తోందట. దీని కోసమై దీపికాను చిత్ర బృందం కలవగా, ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా ఓ సూపర్‌ జోడీతో అదిరిపోయే సినిమా చూడబోతున్నామన్నమాట. దీపికా నటించిన ‘పద్మావత్‌’ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. అలాగే ప్రభాస్‌ ప్రస్తుతం త్రిభాషా చిత్రం ‘సాహో’లో నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయిక.