యూరప్ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమాకి రెడీ !

‘బాహుబలి 2’ కు ముందు చాలా కాలంగా సినిమాలే లేని ప్రభాస్ ఇప్పుడు దూకుడు మీదున్నాడు . ‘సాహో’కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ బాలీవుడ్ ఐడియాను పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేశాడట. అది కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనేనని తెలుస్తోంది.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘సాహో’ సినిమాను అనౌన్స్ చేసిన ప్రభాస్. ఇప్పటివరకూ ఓ టీజర్‌కు మినహా మళ్లీ షూటింగ్‌లో పాలుపంచుకున్న ధాఖలాలు లేవు. అయితే హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొక్షన్ పనులే ఈ జాప్యానికి కారణం అని తెలుస్తోంది.

అయితే ఈలోగా ప్రభాస్ తదుపరి చిత్రాన్నీ లైన్‌లో పెట్టేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పైనే రాథాకృష్ణ డైరెక్షన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టేశాడు. ‘జిల్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రాథాకృష్ణ… ప్రభాస్‌తో యూరప్ బ్యాక్ డ్రాప్‌లో ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కించబోతున్నాడట. ‘సాహో’ తరువాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులనూ ఆకట్టుకునే విధంగా ముస్తాబవుతున్న ‘సాహో’ కోసం నీల్ నితిన్ ముఖేష్‌తో పాటూ మరో హిందీ నటుడు చుంకీ పాండేను మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు నిర్మాతలు. ప్రభాస్‌కు బాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగే ఏర్పడటంతో అన్ని ప్రాంతాల్లో మంచి మార్కెట్ కోసం నిర్మాతలు ఈ కొత్త స్ట్రాటజీని ఫాలో అయిపోతున్నారు.