దక్షిణాదిన అతిపెద్ద సూపర్ స్టార్ ఇతడే !

ఇప్పుడు సౌత్ స్టార్స్ అంతా బాలీవుడ్ ఆడియెన్స్‌కు బాగా సుపరిచితులు అయిపోయారు. అనువాద రూపంలో మన హీరోలు నటించిన సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.ఫ్యాన్ ఫాలోయింగ్, పారితోషికం విషయంలో హిందీ హీరోలకు ఏమాత్రం తీసిపోరు మన దక్షిణాది హీరోలు. దీంతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఫుల్ ఫోకస్ పెట్టింది బాలీవుడ్. అందుకేనేమో ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ‘సౌత్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ ఎవరనే దానిపై పోలింగ్ నిర్వహించింది.
 ఈ పోల్‌లో ‘యంగ్ రెబెల్ స్టార్’ ప్రభాస్ 2017 సంవత్సరానికి దక్షిణాదిన అతిపెద్ద సూపర్ స్టార్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. ‘బాహుబలి’కి ముందు టాలీవుడ్‌లో మూడు, నాలుగు స్థానాలకే పరిమితమైన ప్రభాస్ ఇమేజ్ ‘బాహుబలి’ తర్వాత పీక్స్‌కు వెళ్లిపోయింది. అందుకేనేమో ఈ పోల్‌లో 35 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు బాహుబలి.ప్రభాస్ తర్వాత 30 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇక 12శాతం ఓట్లతో అజిత్, 11 శాతం ఓట్లతో ఎన్టీఆర్, 5 శాతం ఓట్లతో విజయ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 2015లో అజిత్, 2016లో పవన్ కళ్యాణ్, 2017లో ప్రభాస్ సొంతమయ్యింది ‘సౌత్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’ కిరీటం .