నలభై కోట్లతో ప్రభాస్ ‘బాహుబలి థియేటర్స్’

బాహుబలి హీరో ప్రభాస్ వ్యాపార రంగం లోకి అడుగు పెడుతున్నాడు . నెల్లూరు జిల్లాలో ప్రభాస్ ‘బాహుబలి థియేటర్లు’ సిద్ధమవుతున్నాయి. ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు థియేటర్ల మల్టీకాంప్లెక్స్‌.. ఆవరణలో రెస్టారెంట్లు.. చిన్నపిల్లల ఆటలకు ప్రత్యేక విభాగంతో రూపుదిద్దుకొంటున్నాయి. ఇందులో ఒక థియేటర్‌లో దేశంలోనే మరెక్కడా లేనంతగా తొలిసారి త్రీడీ ఎఫెక్ట్స్‌తో కూడిన 106 అడుగుల భారీ స్క్రీన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ తెర ఎదుట 670 సీట్లు ఉంటా యి. ఇక మిగిలిన రెండు థియేటర్లలో 170 సీట్ల చొప్పున ఉంటాయి. ఇన్ని హంగులున్న ఈ థియేటర్లను రూ.40 కోట్లతో హీరో ప్రభాస్‌ నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై వీటిని నిర్మాణం వేగంగా సాగుతోంది. 2018 తొలి త్రైమాసికంలో వీటిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మల్టీప్లెక్స్‌ నిర్మాణం పూర్తయ్యాక ఇక్కడ భారీ కల్యాణ మండపాన్ని కూడా ప్రభాస్‌ నిర్మించబోతున్నారు.