నేను పురాణాల్లోని రాధను కాను.. ద్విపాత్రలు‌ చేయడం లేదు!

ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న భారీ తెలుగు చిత్రమిదే. 1970ల కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హీరోహీరోయిన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 13న పూజా పుట్టినరోజు సందర్భంగా ఓ భావోద్వేగ సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారని ఆమె తెలిపారు. విదేశాల్లో షూటింగ్‌  పరిస్థితుల గురించి  పూజాహెగ్డే మాట్లాడుతూ.. ‘‘ఇటలీలో కరోనా ఏ విధంగా విజృంభించిందో అందరికీ తెలిసిందే! అక్కడ వైరస్‌ ఉదృతి తగ్గి, అనుమతులు లభించాక షూటింగ్‌కు వెళ్లాం. ఓ లొకేషన్‌లో చిన్న సెట్‌ వేసుకుని కొద్దిమందితో జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నాం. షూటింగ్‌ మొదలైన మొదటి రెండు రోజులు చాలా భయంగా, ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టే ముందు పరీక్షలు చేయించుకుంటున్నాం. కెమెరా ముందు మాత్రమే మాస్క్‌ తీస్తున్నాం. ఇక పాత్ర విషయానికొస్తే.. ఇందులో నాది పురాణాల్లో చూపించే రాధ పాత్ర కాదు. అయితే ఇందులో పాత్రలకు చారిత్రాత్మకమైన ప్రేమికులే స్ఫూర్తి. నాలో ప్రతిభను బయటపెట్టడానికి మంచి అవకాశం దొరికింది. ఇందులో డ్యూయెల్‌ రోల్‌ చేయడం లేదు’’ అని అన్నారు.

రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ 150 కోట్ల పీరియాడిక్‌ ప్రేమకథా చిత్రాన్ని యు.వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌, టి సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్, పూజా కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుందని దర్శకుడు ఇటీవలే పేర్కొన్నారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

‘సర్కస్’‌ లో ర‌ణ్‌వీర్‌కు జంట‌గా పూజా హెగ్డే…  రణవీర్ సింగ్ ‌మరోసారి క్రేజీ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టితో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ‘సింబా’ ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. తాజాగా వీరిద్దరి కలయికలో కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సర్కస్‌’ సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రం షేక్‌స్పియర్ నవల ‘ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఆధారంగా తెరకెక్కనుంది. ‘సర్కస్’‌ లో ర‌ణ్‌వీర్‌కు జంట‌గా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ క‌ధా‌నాయిక‌లుగా న‌టిస్తున్నారు. అలాగే వ‌రుణ్ శ‌ర్మ‌, సిద్ధార్ధ జాద‌వ్, జానీ లీవ‌ర్, సంజ‌య్ మిశ్రా, వ‌ర్జేష్ హిర్జీ, విజ‌య్ ప‌ట్క‌ర్, సుల్బ ఆర్య‌, ముఖేష్ తివారి, అనిల్ చ‌ర‌ణ్‌జీత్‌, అశ్విని క‌లేస్క‌ర్, ముర‌ళీ శ‌ర్మ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం ముంబై, ఊటీ, గోవా ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకోనుంది. భూషన్‌ కుమార్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.